ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ జయించేందుకు  ప్రపంచ దేశాల  ప్రజలు ఎంతగానో పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నో కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చినప్పటికీ ఎక్కడ కరోనా వైరస్  విజృంభణ మాత్రం ఆగటం లేదు. ఎన్ని ఆంక్షలు తీసుకొచ్చిన నిర్బంధం విధించిన.. ప్రపంచ మహామారి  వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. ప్రపంచవ్యాప్తంగా అందరినీ చిగురుటాకులా వణికిస్తూ  ఎంతో మందిని పొట్టన పెట్టుకుంటోంది ఈ మహమ్మారి వైరస్. భారత్లో కూడా ఈ మహమ్మారి వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. 

 

 

 రోజురోజుకు ఈ ప్రాణాంతకమైన మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరిగి పోతూనే ఉంది. దీంతో రోజు రోజు భారత ప్రజల్లో  ప్రాణ భయం కూడా పెరిగిపోతుంది. అయితే ఇప్పటికే భారతదేశంలో లాక్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రజలందరూ ఇంటికే పరిమితం కాగా దేశ వ్యాప్తంగా అన్ని రకాల రవాణా వ్యవస్థ రద్దు అయింది... జన సమూహం ఉండే అన్ని ప్రాంతాలు మూతపడ్డాయి. ప్రజలందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఇదిలా ఉంటే కరోనా  వైరస్ ను కట్టడి చేసేందుకు ఎక్కువగా జిల్లా వాసులు వినూత్న రక్షణ చర్యలు చేపడుతున్నారు. 

 

 

 మొన్నటివరకు లాక్ డౌన్ నేపథ్యంలో మా ఊరికి ఎవరూ రావద్దు మా ఊరు నుండి ఎవరు వెళ్ళద్దు అంటూ రక్షణగా నిలిచిన గ్రామాల ప్రజలు... ప్రస్తుతం మరో వినూత్న రక్షణ చర్యలు చేపట్టారు. కరోనా వైరస్ ను తరిమి కొట్టాలి అంటే సామాజిక దూరం ఎంతైనా అవసరం అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జిల్లా వాసులు సామజిక దూరం పాటించే విదంగా  మా  డోర్  ని ఎవరు ముట్టుకోవద్దు అనే బయటి వారికి కనిపించే విధంగా తెల్లటి సున్నంతో రాసుకున్నారు. తెలంగాణలోని జహీరాబాద్ పట్టణంలోని కొన్ని ఇళ్ల  తలుపులకు ఇలాంటి రాతలు కనిపిస్తున్నాయి. కాగా ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఇలా గ్రామాల్లో కరోనా  వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నిర్బంధంలోకి వెళ్ళిపోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: