అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ తీవ్రత అత్యధికంగా ఉంది. ముఖ్యంగా న్యూయార్క్‌లో ఈ మహమ్మారి విశ్వరూపం దాల్చింది. హాస్పటల్స్ అన్నీ వైరస్ బారినపడిన వారితో నిండిపోయాయి. కరోనా వైరస్ అమెరికాను కబళిస్తోంది. రోజూ వందలాదిమంది ప్రాణాలను బలిగొంటోంది. నిన్న ఒక్క రోజే ఏకంగా 1100 మంది ఈ ప్రాణాంతక వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఒక్క న్యూయార్క్‌ రాష్ట్రంలోనే 630 మంది మృతి చెందారు.

 

అంటే ప్రతీ రెండున్నర నిమిషాలకు ఒకరు చొప్పున చనిపోయారన్నమాట.  ప్రస్తుతం అమెరికాలో... 276037 పాజిటివ్ కేసులుండగా... మృతుల సంఖ్య 7385గా ఉంది. ఐతే... వచ్చే రెండు వారాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య బాగా పెరిగి... 10 లక్షలు దాటే ప్రమాదం ఉంంటున్నారు నిపుణులు. ఇందుకు కొన్ని బలమైన కారణాలు చెబుతున్నారు. వాటిని పరిశీలిస్తే... నిజంగానే కేసులు పెరుగుతాయని మనకు అనిపిస్తుంది.    ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చినప్పుడు ముఖాలను వస్త్రంతో పూర్తిగా కప్పుకోవాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు.

 

ఇంట్లో తయారు చేసుకున్న మాస్కులను ఉపయోగించి, వైద్యపరమైన మాస్కులను వైద్య సిబ్బంది కోసం వదిలిపెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సాధారణ శ్వాస, దగ్గు, తుమ్ము ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాపించే అవకాశం ఉందన్న నేపథ్యంలో ట్రంప్ ఈ సూచన చేశారు. ఇదిలా ఉంటే.. న్యూయార్క్‌లో ట్రంప్ సర్కార్ లాక్‌డౌన్ విధించకపోవడంతోనే అక్కడ అత్యధిక కేసులు నమోదవుతున్నాయని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.


 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: