ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే.  అన్ని దేశాలను చిగురుటాకులా వణికిస్తూ... ప్రాణ భయాన్ని  కలిగిస్తూ... ఎంతో  మందిని పొట్టన పెట్టుకుంది ఈ మహమ్మారి వైరస్. ఈ వైరస్ నియంత్రణకు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ వైరస్ మాత్రం ఎక్కడా కంట్రోల్ కావడం లేదు. ప్రభుత్వాలు వైరస్ ను కట్టడి చేసేందుకు ఎన్నికల నిబంధనలు అమల్లోకి తెచ్చిన... ప్రజలు చేస్తున్న చిన్న చిన్న నిర్లక్ష్యం కారణంగా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. వెరసి ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అయితే కరోనా  వైరస్ నేపథ్యంలో కొంతమంది ప్రజల జీవితాలు  చిన్నాభిన్నం అయిపోతున్నాయి.

 

 

 ముఖ్యంగా కొన్ని గ్రామాల పరిస్థితి అయితే మరింత దారుణంగా మారిపోయింది. ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో దేశంలో ఎలాంటి రవాణా సౌకర్యం లేని నేపథ్యంలో... సమీప ఆసుపత్రి లేని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో లాక్ డౌన్ చాలా మందికి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇలాంటి ఒక ఫొటోస్ వైరల్ గా మారిపోయింది. అనారోగ్యంతో ఉన్న పిల్లవాడిని ఎత్తుకుని  ఎలాంటి రవాణా సౌకర్యాలు లేకపోవడంతో ఎన్నో కిలోమీటర్ల దూరం ఉన్న ఆసుపత్రికి మండుటెండలో నడుచుకుంటూ వెళుతున్న మహిళ  దృశ్యం ప్రస్తుతం అందరినీ కలిచి వేస్తుంది.

 

 ఇది ఛత్తీస్ ఘడ్ లోని  సమేలి -అరన్ పూర్   రహదారిలో చోటు చేసుకుంది. ఈ  రహదారిపై మహిళలు తమ ఇద్దరు పిల్లలను తీసుకొని మండుటెండలు ఆస్పత్రికి నడుచుకుంటూ వచ్చారు. అనారోగ్యం బారినపడిన తమ చిన్నారులకు వైద్య పరీక్షలు అందించేందుకు ఆస్పత్రి వెళ్లాలంటే 12 కిలోమీటర్ల వెళ్లాల్సి ఉంది  ప్రస్తుతం లాక్ డౌన్  నేపథ్యంలో ఎలాంటి సౌకర్యాలు అందుబాటులో లేవు . ఈ క్రమంలో చేసేదేమీ లేక గ్రామం నుంచి కాలినడకన ఆస్పత్రికి చేరుకున్నారు. అయితే నెల రోజుల నుండి ఆంబులెన్స్ డ్రైవర్ కూడా అందుబాటులో లేడు అని పీహెచ్సీ సిబ్బంది  తెలిపారు అంటూ సదరు మహిళలు  చెబుతున్నారు. పై అధికారులు చొరవ చూపి అంబులెన్స్ డ్రైవర్ ని ఏర్పాటు చేయాలి అంటూ సదరు మహిళలు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: