లాక్‌డౌన్ ఎత్తివేత‌పై సంగిగ్ధ‌త నెల‌కొంది. క‌రోనా మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేసేందుకు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఈనెల 14 వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్ర‌క టించిన సంగ‌తి తెలిసిందే.  అయితే కేంద్ర ప్ర‌భుత్వం తొలుత ప్ర‌క‌టించిన విధంగా ఏప్రిల్ 14తో లాక్‌డౌన్ ముగుస్తుందా... లేదా అనేది స‌స్పెన్స్‌గా మా రింది.  అయితే క‌రోనా వైర‌స్ తీవ్ర‌త అధికంగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్ య‌థావిధిగా కొన‌సాగే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. మిగ‌తా ప్రాంతాల్లో సాధార‌ణ స్థితి నెల‌కొంటే లాక్‌డౌన్ ను పూర్తిగా ఎత్తివేసే అవ‌కాశం ఉందంటున్నారు.  మ‌రోప‌క్క ఈనెల 15 నుంచి ఎయిర్ ఇండియా టికెట్లు విక్ర‌యిస్తామ‌ని సంస్థ ప్ర‌క‌టించ‌గా, రైళ్ల పునరుద్ధ‌ర‌ణ అంశంపై ఇంకా నిర్ణ‌యం తీసుకోలేద‌ని ఆశాఖ  అధికారులు పేర్కొంటుండ‌టం గ‌మ‌నార్హం. ఇదిలా ఉంటే భార‌త్‌లో ఆదివారం వ‌ర‌కు  క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు 3, 072 కేసులు న‌మోదుకాగా,  75 మంది వైర‌స్ బారిన ప‌డి మృతిచెందారు.

మరింత సమాచారం తెలుసుకోండి: