తాజాగా ఏపీ  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్వహించే  మీడియా సమావేశలపై తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితి అనుసరించి జగన్ మాట్లాడే మాటలపై చాలా విమర్శలు వస్తున్నాయి. ఇందుకు కారణం శనివారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశమే ఒక నిదర్శనం అనే చెప్పాలి. ఇందులో ప్రజల కోసం వీడియో సందేశం ఇవ్వడం జరిగింది. కానీ ఈ సమావేశం ఎక్కువ సమయం లేదు అన్న వార్తలు గుసగుసలాడుతున్నాయి. అలాగే దీనితో పాటు టీవీ సౌండ్ పెంచే లోపే సమావేశం అయిపోయిందని విమర్శలు వస్తున్నాయి. 

 

 

ఇంకోవైపు ఈ మీడియా సమావేశం లైవ్ అనే వార్తలు కూడా వినిపించాయి. కానీ అది రికార్డ్ అని అందరికి క్లియర్ గా అర్ధం అవుతుంది. ఇందులో కేవలం తబ్లీగీ జమాత్ వాళ్ళను వెనకేసుకుని వచ్చి ఆయన మీడియా సమావేశానికి స్వస్తి చెప్పారు. దీనితో పాటు ప్రజలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని సలహా ఇవ్వడం జరిగింది. అంతే కానీ ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి  ఎలా ఉంది ఏ జిల్లాలో ఎన్ని కేసులు నమోదు అయ్యాయి అన్న విషయం గురించి ఏం మాట్లాడలేదు అని అర్థం అవుతుంది. ఇక ఈ సమావేశంలో మోడీ ఇచ్చిన పిలుపుని రాష్ట్ర ప్రజలు అందరూ కూడా విజయవంతం చేయాలని ఆయన తెలిపారు. ఇందుకొసం మీడియా ముందుకు రావాలా.. సోషల్ మీడియాలో ఒక వీడియో పెడితే సరిపోతుంది కదా అని మరి కొందరు పెదవి విరుస్తున్నారు. 

 

 


అయితే మరోవైపు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడూ మీడియా ముందుకు వచ్చి ప్రజలకు జాగ్రత్తలను తెలుపుతూ ఉంటే, జగన్ మాత్రం మీడియా ముందుకి వచ్చిన ప్రతీసారి ఏదో ఒక వివాదంలో పడడం గమనిస్తున్నాము. ఏది ఏమైనా జగన్ తనదైన సైలిలో ఏపీ రాష్ట్ర ప్రజలకి తన వంతో ధైర్యం చెప్పడం చాలా అవసరమని కొంత మంది అనేవారు లేకపోరు. 


 

మరింత సమాచారం తెలుసుకోండి: