దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ నిబంధన ఏప్రిల్ 14వ తేదీ తో ముగియనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజలు స్వేచ్ఛగా రోడ్లమీదకు రావచ్చని, యధావిధిగా వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించుకునే అవకాశం ఉంటుందని అందరూ అంచనాలో ఉన్నారు. ఇప్పటివరకు పడిన, పడుతున్న ఇబ్బందులన్నిటిని మరిచిపోతూ ఏప్రిల్ 14 వ తేదీ కోసం ఎదురుచూస్తున్నారు. కానీ అకస్మాత్తుగా మరో వారం రోజులు లాక్ డౌన్ ను పెంచే విధంగా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ విషయం పై ప్రధాని నరేంద్ర మోడీ ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ , దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో దేశవ్యాప్తంగా ఆందోళన చెలరేగుతోంది. వైరస్ కట్టడి చేసే వ్యూహంలో భాగంగా డబ్ల్యూహెచ్ఓ జారీచేసిన మార్గదర్శకాలు ప్రకారం దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్ డౌన్ ను కేంద్రం విధించినా, ముందుగా జనతా కర్ఫ్యూ పేరుతో ఒక రోజు దీనిని అమలు చేశారు. ఇక ఆ తర్వాత రోజు నుంచి 21 రోజుల పాటు అంటే ఏప్రిల్ 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా కఠినంగా లాక్ డౌన్ నిబంధనలు అమలు చేస్తున్నారు. 

 

IHG


జనాలు బహిరంగంగా తిరగడం నిషేధించడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని మరికొంతమందికి వ్యాప్తి చెందకుండా అడ్డుకోవచ్చని కేంద్రం భావించింది. అనుకున్నట్లుగానే ఈ లాక్ డౌన్ నిబంధన సక్సెస్ అవుతున్నట్టు కనిపిస్తున్న దశలో అకస్మాత్తుగా ఢిల్లీలో మార్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్టుగా తేలింది. ఢిల్లీ మాత ప్రార్థనలకు హాజరైన వారిలో 16 రాష్ట్రాలకు చెందిన వారు ఉండడంతో, ఈ వైరస్ వ్యాప్తి దేశవ్యాప్తంగా ఉద్ధృతం అయింది. ప్రస్తుతం నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో సుమారు 30 శాతం ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి ద్వారానే నమోదవడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. దీంతో అప్రమత్తమైన కేంద్రం ఢిల్లీ మాత ప్రార్థనకు వెళ్లి వచ్చిన వారందరినీ గుర్తించి వారిని క్వారంటైన్ కు  తరలించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 

 

ఇప్పటికే మూడు వంతుల మందిని క్వారంటెన్ కు తరలించినా మిగతా వారి ఆచూకి ఇప్పటి వరకు లభించలేదు. మరికొంత మంది వైద్య పరీక్షలు చేయించుకునేందుకు నిరాకరిస్తూ వైద్యుల పై దాడులు జరుగుతున్న సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ మాత ప్రార్థనకు వెళ్లి వచ్చిన వారిలో ఎక్కువ మంది కి కరోనా వైరస్  రావడం ఆ విషయం ఆలస్యంగా గుర్తించడంతో వారి కుటుంబ సభ్యులకు, వారితో సన్నిహితంగా మెలిగిన వారికి ఈ వైరస్ సోకి ఉంటుందని అనుమానంతో అందర్నీ క్వారంటైన్ చేసే పనిలో నిమగ్నమయ్యారు అధికారులు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఏప్రిల్ 14వ తేదీతో క్వారంటైన్ ముగియనున్న నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు లాక్ డౌన్ ను మరో వారం రోజులు పొడిగించాల్సిందిగా నివేదికను ప్రధాని నరేంద్ర మోదీ కి ఇచ్చినట్టు సమాచారం. అయితే దీనిపై ఆయన సమీక్ష చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో లాక్ డౌన్ ను 14వ తేదీతో ఎత్తి వేస్తారా..? లేక మరో వారం రోజుల పాటు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచనలతో పొడిగిస్తారా..? అసలు మోదీ రియాక్షన్ ఏంటి అనేది ఉత్కంఠ కలిగిస్తోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: