ప్రపంచంలో ఇప్పుడు కరోనా ఏ రేంజ్ లో విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  కరోనా సోకకుండా ప్రపంచ దేశాలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. కానీ రోజు రోజు కీ ఈ మరణాలు పెరిగిపోతూనే ఉన్నాయి.  దేశంలో లాక్ డౌన్ చేసినప్పటికీ ఈ కరోనా మరణాలు పెరిగిపోతున్నాయి.  ఒకటి కాదు రెండు కాదు  ప్రపంచ వ్యాప్తంగా వేలల్లో మరణాలు.. లక్షల్లో బాధిత సంఖ్యలు. దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధికం ఢిల్లీలో జరిగిన మతపరమైన కార్యక్రమంతో ముడిపడినవే ఉన్నాయి.

 

ఢిల్లీ నుంచి తమ రాష్ట్రాలకు చేరుకున్న మర్కజ్ యాత్రికుల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందని అంటున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఒకట్రెండు రోజుల వ్యవధిలో భారీగా పాజిటివ్ కేసులు రావడంతో వెంటనే అప్రమత్తం అయ్యాయి.  తాజాగా వందలాది మంది కార్మికులు పనిచేసే చోట ఓ మహిళ కరోనాతో మృతి చెందడంతో ముందు జాగ్రత్తగా మొత్తం 800 మంది కార్మికులను అధికారులు క్వారంటైన్ సెంటర్లకు తరలించారు.  రంగారెడ్డి జిల్లా చేగూరు గ్రామ పరిధిలోని కన్హా శాంతివనంకు చెందిన ఓ మహిళ కరోనా వైరస్ కారణంగా చనిపోయింది.

 

దాంతో అక్కడ పనిచేసే 800 మందిని క్వారంటైన్ కి పంపించారు.  శాంతివనంను సందర్శించిన కలెక్టర్ అక్కడి పరిస్థితిని గమనించారు. మొత్తం అక్కడ పనిచేస్తున్న కార్మికులందరినీ క్వారంటైన్ సెంటర్లకు తరలించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. అలాగే కలెక్టర్ ఆదేశాల మేరకు చేగూరు గ్రామ సరిహద్దులో చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. గ్రామంలోకి రాకపోకలను పూర్తిగా నిషేధించారు. 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: