దక్షిణాసియాలోనే భారత్ అతి పెద్ద దేశంగా ఉందని ఇంతదాకా అంతా ఆనందించారు, గర్వపడ్డారు. ఇపుడు బాధపడే, భయప‌డే వార్తల్లో కూడా భారత్ టాప్ అంటున్నారు. భారత్ జనాభాలో చైనాతో సమానంగా ఉన్న దేశం. భౌగోళికంగా మిగిలిన దేశాల కంటే కూడా పెద్దదే. అన్ని విధాలుగా అభివ్రుధ్ధి చెందాలని అడుగులు వేస్తున్న భారత్ కి తాజా పరిణామాలు ఒక్కసారిగా కలవరపెడుతున్నాయి.

 

భారత్ ఇపుడు దక్షిణాసియాలోనే కరోనా పాజిటివ్ కేసుల్లో అగ్ర భాగాన ఉంది. ఇప్పటివరకూ వెల్లడైన గణాంకాలు ఈ సంగతినే తెలియచేస్తున్నాయి. దక్షిణాసియాలో మొత్తం ఆరు వేల కేసులు  కరోనా పాజిటివ్ గా నమోదు  అయ్యాయి. ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా పెరుగుతుందని అంటున్నారు. భారత్ విషయానికి వస్తే అనేక రుగ్మతలు, భిన్నత్వంలో ఏకత్వం, ప్రాంతాలు, మతాలు, నిరక్షరాస్యత, వర్గాలు వంటి కారణంగా కరోనా కేసులు వెల్లువలా పెరుగుతున్నాయని అంటున్నారు.

 

దక్షిణాసియాలో ఉన్న ఆరు వేల కేసుల్లో మూడువేలకు పైగా కేసులు ఒక్క భారత్ లో ఉన్నాయంటే సగభాగాన్ని తీసుకున్నట్లైంది. రానున్న రోజుల్లో దక్షిణాసియాలో  ప్రతీ పది కేసుల్లో మెజారిటీ కేసులు భారత్ నుంచే వస్తాయని కూడా వైద్య  నిపుణులు అంటున్నారు. భారత్ తో పాటు, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లలో ముస్లిం మైనారిటీలు ఎక్కువగా ఉన్నారు. వారు తమ మతాచారాలను లాక్ డౌన్ సమయంలో కూడా  అసలు ఆపడంలేదని అంటున్నారు.

 

పాకిస్థాన్ లాంటి చాందసవాద దేశం మసీసులకు వెళ్ళి నమాజ్ చేయవద్దంటూ శుక్రవారం పూట మసీదుల వద్ద కర్ఫ్యూ పెట్టాల్సివచ్చినంటేనే పరిస్థితి ఎంతవరకూ వచ్చిందో అర్ధం చేసుకోవాలి. ఇక బంగ్లాదేశ్ లో ఇదే రకమైన పరిస్థితి ఉందిట. లాక్ డౌన్ కి అక్కడి ప్రజలు సహకరించడకపోవడం వల్లనే కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని అంటున్నారు.

 

భారత్ లో కూడా గత అయిదు రోజుల వరకూ 1300 వరకూ ఉన్న కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగిపొయాయి. లాక్ డౌన్ ని  దేశంలో కొన్ని రాష్ట్రాల్లో పూర్తిగా  పాటించడం లేదని అంటున్నారు. అలా చేయడం వల్ల లాక్ డౌన్ ఫలితం ఉండదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ వైపు హెచ్చరిస్తోంది కూడా. ఇవన్నీ  ఇలా ఉంటే అఫ్ఘనిస్తాన్ లో కూడా కరోనా కేసులు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. అదే విధమైన పరిస్థితి ఇపుడు శ్రీలంకలో కూడా ఉందిట. ఇక ఉన్నంతలో నేపాల్ లో కరోనా కేసులు రెండు పదులు మించడంలేదు, పైగా ఒక్క మరణం కూడా ఇప్పటి దాకా నమోదు కాలేదు. 

 

ఇవన్నీ గమనంలోకి తీసుకున్నపుడు దక్షిణాసియా దేశాలకు పెద్దన్నగా  ఉన్న భారత్ కరోనా కేసుల విషయంలోనూ అదే సరళిని కొనసాగిస్తోందని అంటున్నారు. పేద దేశాలు, పెద్ద దేశాలూ, కరోనా విషయంలో తగిన జాగ్రత్తలు పాటించకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సివస్తుందని ఐక్య రాజ్యసమితి గట్టిగా  చేస్తున్న హెచ్చరికలు కూడా ఇపుడు పట్టించుకోకపోతే కనుక ప్రపంచంలోనే దక్షిణాసియా చాలా ముందు వరసలో కరోనా కేసుల విషయంలో నిలుస్తుందని అంటున్నారు. ఇదే ఇపుడు భారత్ ని కూడా ఆందోళన కలిగిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: