తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు ( ఆదివారం) సాయంత్రం 4 గంట‌కు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సమీక్ష నిర్వ‌హించ‌నున్నారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తికి అడ్డ‌క ట్ట  వేసేందుకు తీసుకోవాల్సిన మ‌రిన్ని చ‌ర్య‌ల‌పై ఆయ‌న అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేయ‌నున్నారు. ఇప్ప‌టికే అమ‌ల‌వుతున్న లాక్‌డౌన్‌ను మ‌రింత క‌ఠినత‌రం చేయ‌డంపై స‌మీక్షించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ రోజు రాత్రి తొమ్మిది గంట‌ల నుంచి తొమ్మిది నిమిషాల‌పాటు ఇండ్ల‌ల్లో దీపాలు వె ల‌గించాల‌ని ప్ర‌ధాని మోడీ పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. ముఖ్యంగా ఈ అంశంపైనే మాట్లాడేందుకు సీఎం సమీక్ష నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌జ‌లంతా ఇళ్ల‌లో దీపాలు వెలిగించాల‌ని పిలుపునివ్వ‌నున్నారు. అంతేగాక ఇప్ప‌టికే అమ‌లువుతున్న లాక్‌డౌన్‌ను మ‌రింత క‌ఠిన‌త‌రం చేయ‌డంతోపాటు ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న  క‌ల్పించేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై దిశానిర్దేశం చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. కాగా తెలంగాణ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 272 మంది క‌రోనా వైర‌స్ బారిన ప‌డ్డారు.  అందులో 228 మంది వివిధ ద‌వాఖాన‌ల్లో చికిత్స పొందుతున్నారు. కాగా  33 మంది చికిత్స పొంది చికిత్స పొంది ఇంటికి వెళ్ల‌గా, 11 మంది మ‌ర‌ణించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: