దేశంలో ఇప్పుడు కరోనా వ్యాప్తిని అరికట్టెందుకు ప్రస్తుతం లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే.  ఇప్పుడు దేశం మొత్తం ప్రజలు ఇంటి పట్టునే ఉంటున్నారు. కానీ రోజు రోజుకీ కరోనా కేసులు మాత్రం పెరిగిపోతూనే ఉన్నాయి.  ఇటీవల ఢిల్లీలో జరిగిన మతపరమైన కార్యక్రమానికి వెళ్లి వచ్చిన వారికే ఈ కరోనా కేసులు ఎక్కువగా ప్రబలి పోతున్నాయి.  ఢిల్లీ నుంచి తమ రాష్ట్రాలకు చేరుకున్న మర్కజ్ యాత్రికుల ద్వారా కరోనా వ్యాప్తి విస్తృతమైంది. తెలుగు రాష్ట్రాలు కూడా అందుకు మినహాయింపు కాదు అని అంటున్నారు. 

 

తాజాగా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. 'సామాజిక దూరం పాటించాలి. ఇళ్లలో స్వీయ నిర్బంధంలో ఉంటే తప్ప కరోనాను నియంత్రించలేం. మహారాష్ట్రలో కరోనా మూడో స్టేజికి వెళ్లినట్టు అక్కడ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. విదేశాల నుంచి వచ్చిన వాళ్లెవరినీ కలవకున్నా వ్యాధి సోకినట్టు గుర్తించారు. మనకు ఆలాంటి ప్రమాదం రాకుండా జాగ్రత్త పడాలి' అని ట్వీట్ చేశారు. 

 

ఇప్పుడు కరోనా పై ప్రతి ఒక్కరూ యుద్దం చేయాల్సిన పరిస్థితి.. దేశ భద్రతకు తమ వంతు బాధ్యత వహించాలని అంటున్నారు. సిఎం జగన్ గారు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. నూకల పేరుతో కాకినాడ నుంచి బియ్యం ఎగుమతి చేసిన మాఫియా ఆటలు సాగవు. అర్థమవుతోందా బాబూ?' అని విజయసాయిరెడ్డి ట్వీట్లు చేశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: