దేశంలో ఓ వైపు కరోనా తో అతలాకుతలం అవుతుంటే.. మరో వైపు ఉగ్రవాదులు తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు.  ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మాహమ్మారి ఇప్పుడు ఎవ్వరికీ కంటి మీద  కునుకు లేకుండా చేస్తుంది.  తాజాగా భారత్ లో మరోసారి ఉగ్రవాదులు చొరబడటానికి ప్రయత్నాలు చేస్తున్నారు.  తాజాగా భారత్‌ కరోనా సమస్యతో సతమతమవుతోంటే ఉగ్రవాదులు తమ పని తాము చేసుకుపోతున్నారు. జమ్మూకశ్మీర్‌లో చొరబాట్లకు ఉగ్రవాదులు ప్రయత్నాలు జరుపుతున్నారు.

 

ఈ విషయాన్ని గుర్తించిన భారత భద్రతా బలగాలు కశ్మీర్‌ లోయలో ఉగ్రవాదులను చుట్టుముట్టాయి. దాంతో ఉగ్రవాదులు తిరిగి కాల్పులుకు తెగబడ్డారు.  ఎదురు కాల్పుల్లో తొమ్మిది మంది ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు హతమార్చాయి. 24 గంటలుగా ఆ ప్రాంతాల్లో ఆర్మీ ఆపరేషన్‌ కొనసాగుతోంది.  ఈ నేపథ్యంలో కాశ్మీర్ లో ఉగ్రమూకల హడావుడి మళ్లీ మొదలైందని అంటున్నారు.  ప్రస్తుతం దేశం మొత్తం లాక్ డౌన్ చేస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు కరోనాని పక్కన బెట్టి ఇలాంటి కష్ట సమయంలో కూడా తమ దుర్మార్గం పొనిచ్చుకోవడం లేదు.

 

సౌత్‌ బత్పురలో నలుగురు ఉగ్రవాదులు, కెరన్ సెక్టార్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారని అధికారులు ప్రకటించారు. ఈ ఎదురు కాల్పుల్లో ఓ జవాను అమరుడయ్యాడని తెలిపారు. మరో ఇద్దరు జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి.   దేశంలో కరోనా వ్యాప్తి పూర్తిగా వ్యాప్తి అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కష్టాలు పడుతున్న విషయం తెలిసిందే.  అయితే లాక్ డౌన్ ఆసరాగా చేసుకొని ఉగ్రవాదులు తమ జిత్తులు మొదలు పెట్టారని అంటున్నారు.  గత రెండేళ్ల నుంచి భారత్ పై ఉగ్ర పంజా విసురుతూనే ఉన్నారు.  గత ఏడాది ఉగ్రవాదులకు భారత సైనికులు ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పిన విషయం తెలిసిందే.  జమ్మూకశ్మీర్‌లో చొరబాట్లకు ఉగ్రవాదులు ప్రయత్నాలు మళ్లీ తిప్పి కొట్టారు భారత సైనికులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: