అమెరికా అల్లుడు, అమెరికా అమ్మాయి. అమెరికా అమెరికా ప్రతీ దానికీ ముందు లింక్ పెడితే తప్ప తెలుగు వారికి ముద్ద దిగదు, నిద్రపట్టదు, అమెరికా మోజు ఏ రేంజిలో  అంటే అక్కడే పుట్టిన వాళ్ళ కంటే మితిమీరిన  వల్లమాలిన అభిమానం చూపించేస్తూ అన్నింటా అమెరికాను ఇన్నాళ్ళుగా పులుముకున్నారు.

 

ఇపుడు కరోనా దెబ్బకు  అమెరికా సహా ప్రపంచం మొత్తం తలకిందులైంది. అమెరికా అగ్రరాజ్యం దేనికైనా అక్కడ రెడీ, భయాలు, ఆందోళనలు అసలే  ఉండవు, అదో అద్భుత లోకం అనుకున్న వాళ్ళంతా ఇపుడు ఉన్న ఉర్లోనే తెలుగు  నేల మీద బేల  చూపులు చూస్తున్నారు. ఇపుడు అమెరికా ఉన్న పరిస్థితి  చూస్తే మత్రం ఎవరికైనా ఆందోళన కలగకమానదు.

 

ఏంటి అమెరికా ఇండియాను సాయం కోరిందా. కరోనా వైరస్ ఔషధాల కోసం ట్రంప్ మన ప్రధాని మోడీకి ఫోన్ చేసి సహాయం అడిగాడా అంటే ఇపుడున్న భయానక పరిస్థితుల్లో ఆనందం కలిగించకమానదు. ఎలా ఉన్న అమెరికా ఎలా అయిపోయింది. అక్కడ మరణ మ్రుదంగం మోగుతోంది. వేలల్లో మరణాలు, ఓ బాక్టీరియాను అమెరికా కూడా ఏం చేయలేకపోయిందా.

 

ఇవే ఇపుడు తెలుగు యువతలో ఆలోచనలు, సందేహాలు. అమెరికా కంటే మన సొంతూరే బెటర్. అక్కడ కంటే ఇక్కడే మన  ప్రాణాలు దక్కుతున్నాయి అని కరోనా వైరస్ తరువాత వచ్చేసిన వారంతా ఇపుడు ఇక్కడే స్థిరపడాలని చూస్తున్నారు.

 

ఓ వైపు ఆర్ధిక మాంధ్యం, మరో వైపు కరోనా వైరస్ లో ప్రపంచం మొత్తం లాక్ డౌన్ కి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో అమెరికా యానం అంటే యువత భయపడుతోంది. కలో గంజో ఉన్న చోటనే ఉంటూ తినాలనుకుంటోంది. మన వూళ్ళో, ఇక్కడ ఉపాధి చూసుకోవాలనుకుంటోంది.

 

ప్రభుత్వ ఉద్యోగాలు తీస్తే ఒకనాడు కాదని అమెరికా వెళ్ళిన వారు ఈసారి నోటిఫికేషన్ పడితే జాబ్స్ కి  దరఖాస్తు పెట్టేందుకు సిధ్ధంగా ఉన్నారట. మొన్నటివరకూ ప్రభుత్వ ఉద్యోగమా అని వెటకారం చేసి అమెరికా ఫ్లైట్ ఎక్కి చెక్కేసిన వారు గ్రామ సచివాలయాల్లో పదిహేను వేల రూపాయల వార్డు సెక్రటరీల పోస్టులు తీసినా మేము రెడీ అంటున్నారంటేనే కరోనా ఎంతగా మార్చేసిందో అర్ధం చేసుకోవాలి.

 

ఈనాడు పదిహేను వేల రూపాయలు ఆ వార్డు  సెక్రటరీలకు ఇస్తే రేపటి రోజున అది యాభై వేల రూపాయలు అవుతుంది, ఎంతైనా ప్రభుత్వ ఉద్యోగం కదా అని ఆలోచిస్తున్నారుట. మొత్తానికి చూసుకుంటే అమెరికా వద్దు, మన ఆవకాయ ముద్దు అని యువతరం అంటోందంటే కరోనా వైరస్ బాగానే మార్చేసినట్లే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: