అమ్మ అంటే ఓ ఆత్మీయానురాగం,ఓ విడదీయలేని బంధం,పేగు పాశం,ఓ తియ్యని స్వరం.అమ్మ ప్రేమ ఓ మాటలకందని మదురానుబూతి.అమ్మ మురిపాలు,మందలింపులు ఓ గొప్ప వరం.బిడ్డ   పలికే తోలి పలుకులు అమ్మ..!

 

 

అమ్మ ఓ చల్లని నీడ,అమ్మ మనసులో ఆవుపాలలోని స్వచ్చత వుంది,అమ్మ ప్రేమలో  పాల మీగడ లాంటి తియ్యదనం ఉంది, అమ్మవిలువ తెలియని వారికి అమ్మ అంటే ఇంతేనా? అని పిస్తుంది. అదే తెలిసిన వారికి అమ్మ అంటే ఇంతనా! అనిపిస్తుంది. మనుషులకే కాదు ఈ విశ్వ ప్రపంచంలో అన్ని ప్రాణులకూ అమ్మ ప్రేమ అంటే ఏంటో తెలుసు.

 

 

ముగా జీవాలు సైతం తమ పిల్లలు కోసం ఎన్నో త్యాగాలు చేస్తాయి.. ఓర్పులో భూదేవి అంత సహనం ఉంది  అమ్మకి. మనం ఎంత విసిగించిన కానీ అమ్మ కి మాత్రం కోపం రాదు.ఒకవేళ వచ్చి  పిల్లల్ని కొట్టిన గాని మళ్ళీ ఎందుకు నా  బిడ్డని కొట్టనా అని తిరిగి ఏడుస్తుంది.అది అమ్మ అంటే. ఓదార్పులో ఆమెకు ఆమె సాటి.మన ఇల్లు చక్కదిద్దడానికి వచ్చిన కోటి దీపపు కాంతుల వెలుగే అమ్మ.  మన పెద్దవాళ్ళు అపుడపుడు అంటూవుంటారు ఇల్లాల్ని చూసి ఇంటిని చూడు అని... !  మన అమ్మే మన  ఇంటి మహాలక్ష్మి. మన ఇంట్లో నడయాడే దైవం.ఇల్లు చక్కదిద్ది  ఇంటిని, ఇంట్లోని మనుషులని చక్కగా చూసుకుంటుంది..

 

ఇంట్లో వాళ్ళకి ఏ అవసరాలు తీర్చాలన్న అమ్మ కావాలి.వంట చేసి పెట్టాలన్న,  ఇల్లు చక్కబెట్టాలన్న, పని చేయడానికి, అంట్లు తోమడానికి, మన  బట్టలు ఉతకడానికి  ఒకటి ఏంటి ఏ పని చేయాలన్న అమ్మ.. అమ్మ .. ! కానీ మనం  అమ్మ సంస్కృతిని,సంస్కారాన్ని మర్చిపోతున్నాం.. ఏపని చేయాలన్న అమ్మ కావాలి.. అదే అమ్మ వయసు అయిపోయి పని చేయలేని స్థితిలో ఉంటే మాత్రం అమ్మ అవసరం లేదు.  అమ్మకి మనం ఏమి ఇవ్వక్కరలేదు. ప్రేమగా అమ్మ దగ్గర కూర్చుని చేయిపట్టుకుని అమ్మ అని ఆప్యాయతతో  పిలిచే పిలుపు చాలు ఆ అమ్మ కి అంత కన్నా సంతోషం లేదు.

 

ఇప్పటికయినా అమ్మకలలను సాకారం చేద్దాం.ప్రతి ఓక్కరు ఇది పాటిస్తారు అని ఈ చిరు ప్రయత్నం.అమ్మ నీకు జోహారు.అమ్మ ఈ జీవితం నీకే అంకితం.అమ్మ నీ ఒడిలొ పసిపాప అయ్యెటందుకు ఎన్ని జన్మలైన మరణిస్తూ,పుడుతూ వుంటా.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: