దేశంలో కరోనా రోజు రోజుకీ ఏ రేంజ్ లో విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  కరోనా వల్ల ఒకటి కాదు రెండు కాదు వేల సంఖ్యలో మరణాలు సంబవిస్తున్నాయి.  ప్రతి రోజు ఎన్నో కేసులు నమోదు అవుతున్నాయి.  తాజాగా కరోనా భయంతో  అదిలాబాద్‌ జిల్లాలోని మధురా నగర్‌ ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. మధురా నగర్‌ చుట్టుపక్కల నివాసం ఉండే 100 నుంచి 150 కుటుంబాలు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు.

 

తాత్కాలికంగా తమ పంటపొలాల్లో షెడ్లు వేసుకొని ఉంటున్నారు.    దీనికి గల కారణం నిన్న ఒక్కరోజే పది మందికి పాజిటీవ్ లు నమోదు అయ్యాయి.  అయితే మహారాష్ట్రలో కరోనా తీవ్రత ఎంత డేంజర్ గా ఉందో తెలిసిందే.  దాని ప్రభావం కూడా ఇక్కడ ఉందేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. తమ గ్రామాల్లోని ఇతరులకు కూడా కరోనా సోకుతుందన్న భయంతో ప్రజలు వణికిపోతున్నారు. నేరడికొండ మండల కేంద్రంలో ఒక్కరోజే ముగ్గురికి కరోనా నిర్ధారణ అయింది.

 

వారిని వైద్య సిబ్బంది క్వారైంటన్‌కు తరలించారు.  ఈ నేపథ్యంలోనే ఆ మండలంలోని మధురా నగర్‌ ప్రజలు గ్రామం వదిలి పంట పొలాలకు వెళ్లి ఉంటున్నారు. కరోనా పాజిటివ్‌ అని తేలిన వ్యక్తులు ఇంతకు ముందు పది రోజులుగా నేరేడుకొండలో వివిధ ప్రాంతాల్లో తిరిగారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ మరింత సీరియస్ చేస్తున్న విషయం తెలిసిందే.  

 


కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: