ఏప్రిల్ 14 తేదీ తర్వాత లాక్ డౌన్ నిబంధనలను ఎత్తివేస్తామని కేంద్రం ఇప్పటికే స్పష్టమైన సమాచారం ఇవ్వగా గడువు పొడిగిస్తారా లేదా అని ఆందోళనలో ఉన్న వారంతా ఇప్పుడు ఒక్కసారిగా ఖుషీ అయిపోయారు. మిగతా రాష్ట్రాల సీఎంల లో కూడా విషయంపై ఒక క్లారిటీకి వచ్చేయగా యధావిధిగా బస్సులు, రైళ్లు మరియు విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం కావడానికి అవసరమైన ప్రక్రియ అంతా సిద్ధం అవుతోంది.

 

కరోనా కారణంగా మార్చి 23 తేదీ నుండి నిలిచిపోయిన ఆన్ లైన్ బుకింగ్, రిజర్వేషన్స్ మళ్లీ తిరిగి ప్రారంభం అయిపోయాయి. దాదాపు మూడు వారాల గ్యాప్ తర్వాత ఒక్కసారిగా ప్రయాణానికి అవసరమైన వాహనాలు అందుబాటులో ఉండడంతో భారీ స్థాయిలో బుకింగ్ జరుగుతున్నాయి.

 

ఇక రైల్వే రిజర్వేషన్లు అయితే ఏప్రిల్ 15 నుండి 23 వరకు అన్నీ నిండిపోయి వెయిటింగ్ లిస్ట్ నుండి రెగ్రెట్ వరకు వెళ్లిపోయాయి. గత నెల 23 తేదీన లాక్ డౌన్లోడ్ ప్రకటించినప్పటి నుండి రైళ్లు, బస్సుల సర్వీసులు ఎక్కడికక్కడ ఆపివేయగా ఇప్పుడు ఢిల్లీ నిజాముద్దీన్ తబ్లిజి జమాత్ కు వెళ్లి వచ్చిన వారి కారణంగా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరిగిపోగా అసలు అనుకున్న సమయంలో మళ్ళీ రవాణా తిరిగి ప్రారంభం అవుతుందా లేదా అని చాలా అనుమానాలు ఉన్నాయి.

 

మరికొన్ని రోజులు లాక్ డౌన్ పొడిగించే సమాచారం కూడా విస్తృతంగా జరుగుతున్నందున ప్రధాని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో తాజాగా ఒక వీడియో కాన్ఫరెన్స్లో సంభాషించి ఒకేసారిగా కాకుండా దశలవారీగా లాక్ డౌన్ ను ఎత్తివేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

 

దీంతో 14 తర్వాత లాక్ డౌన్ ఎత్తివేస్తారా లేదా అనే దానిపై భిన్న అభిప్రాయాలూ వినపడుతున్నాయి ..కానీ మూడు ప్రయాణ మార్గాలకు మాత్రం ముందుగానే బుకింగ్స్ జరిగిపోతున్నాయి. కాకపోతే లాక్ డౌన్ ఒకవేళ కొనసాగిస్తే బుకింగ్స్ క్యాన్సిల్ చేస్తామనే షరతుతో బుకింగ్ లు జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: