క‌రోనా వైర‌స్ లేదా కోవిడ్‌-19.. చైనాలో పుట్టుకొచ్చిన ఈ మ‌హ‌మ్మారి ప్ర‌పంచ‌దేశాలు వ్యాపించి ప్ర‌జ‌ల‌ను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. భార‌త్‌లో సైతం క‌రోనా ర‌క్క‌సి రోజురోజుకు విజృంభిస్తుంది.  గత 12 గంటల్లో భారత్‌లో 302 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో.. భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3374కు చేరింది. ఇదిలా ఉంటే, కరోనా బారిన పడి భారత్‌లో 77 మంది మరణించారు.  దేశంలో నానాటికీ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. దీనిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు నానా అవస్థలు పడుతున్నాయి.

 

అయినా కరోనా ధాటిని అరికట్టడంలో సఫలీకృతం కాలేకపోతున్నాయి. ఇదిలా ఉంటే.. ప‌శ్చిమ బెంగాల్‌లో సైతం క‌రోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలంతా ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అండగా నిలుస్తున్నారు.  ఇదిలా ఉంటే.. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ’లైట్‌ దియా’ పిలుపుపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రధాన మంత్రి వ్యవహారాల్లో నేనెందుకు కల్పించుకోవాలి? అని ఆమె సూటిగా ప్రశ్నించారు. తాను కరోనాను నియంత్రించాలా? లేదా రాజకీయాలు చేయాలా? అని సూటిగా ప్రశ్నించారు. 'ఆదివారం రాత్రి 9 గంటలకు నాకు నిద్రొస్తే నేను నిద్రపోతాను. 

 

మోదీ మీకు చెప్పాడు.. మీరు చెయ్యండి. నన్నెందుకు దాని గురించి అడుగుతారు. నేనేం చేయగలనో నేను చెబుతాను. మోదీ ఏం చేయగలరో ఆయన చెబుతారు. మీకు నరేంద్రమోదీ చెప్పింది మంచిదనిపిస్తే మీరు చెయ్యండి అని ఆమె తెలిపారు. కాగా, కరోనా చీకట్లను తరిమికొట్టడానికి దేశమంతా ఒక్కటై సంకల్ప బలాన్ని ప్రదర్శించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 5 ఆదివారం రాత్రి 9 గంటలకు ఇళ్లలో లైట్లు అన్ని ఆర్పేసి దీపాలు, కొవ్వొత్తులు, టార్చిలైట్లు, మొబైల్‌లలో ఫ్లాష్‌ లైట్లు తొమ్మిది నిమిషాల సేపు వెలిగించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ప్ర‌స్తుతం అంద‌దూ మోదీ పిలుపు సిద్ధం అవుతున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple


 

మరింత సమాచారం తెలుసుకోండి: