ఇప్పటికే కరోనా మహమ్మారి ఎఫెక్ట్ తో మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు, ప్రజలు పూర్తిగా వణికిపోతున్నాయి. అన్ని దేశాలు కూడా తమ సరిహద్దులను మూసి వేయడంతో పాటు, విమాన రాకపోకలను కూడా పూర్తిగా రద్దు చేసిన విషయం తెలిసిందే. అలానే ముందుగా ఏ దేశానికి ఆ దేశం వారు తమ తమ ప్రజలను పూర్తిగా ఇళ్లకు పరిమితం చేసేలా లాకౌట్ ప్రకటించారు. ఆ విధంగా లాకౌట్ చేయడం వలన ప్రజల మధ్య సామాజిక దూరం పెరిగి కరోనా మరింతగా వ్యాప్తి కాకుండా ఉంటుందని ఇలా చేసినట్లు తెలుస్తోంది. మన దేశంలో మొదట్లో చాలా తక్కువ ఉన్న కరోనా కేసులు, ప్రస్తుతం రోజురోజుకు మరింతగా పెరుగుతుండడంతో ప్రజలతో పాటు ప్రభుత్వం కూడా ఆలోచనలో పడింది. 

 

ఇక మరోవైపు ఇప్పటికే 21 రోజులపాటు మన దేశాన్ని లాకౌట్ ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఇకపై ఎటువంటి చర్యలు తీసుకుని ఈ మహమ్మారిని అంతమొందిస్తారో చూడాలని పలువురు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ కరోనాను ఎదుర్కునే పనిలో భాగంగా ముందుగా నేడు రాత్రి సరిగ్గా 9 గంటల సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఎవరికి వారు తమ తమ ఇళ్లలో లైట్లు పూర్తిగా ఆపివేసి కొవ్వొత్తులను, లేదా దీపాలను, లేదా మొబైల్ ఫోన్ లైట్లను 9 నిమిషాలపాటు ఇంటి బాల్కనీలో వెలిగించి నిలబడాలి అని సూచించడం జరిగింది. దానివలన మన దేశం ఒంటరి కాదనడానికి నిదర్శనంగా ఈ చర్య చేపెట్టినట్లు సమాచారం. 

 

అయితే శాస్త్ర పరంగా కూడా సరిగ్గా రాత్రి 9 గంటలకు అందరూ తమ ఇళ్లలో లైట్స్ ఆపడం మంచిదే అని, అయితే ఆ విధంగా లైట్స్ ఆపితే పవర్ గ్రిడ్స్ కు ఇబ్బంది అని పులువురు నిన్నటి నుండి సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం చేస్తున్నారని, వాస్తవానికి లైట్స్ ఆర్పడం వలన ఎటువంటి ఇబ్బంది ఉండ‌దని, కానీ ఆ సమయంలో టివిలు, ఫ్రిజ్ లు, కంప్యూటర్ల వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఆపవలసి అవసరం లేదని ప్రభుత్వం చెపుతోంది. కాబట్టి లైట్స్ ఆపడం వలన పవర్ గ్రిడ్స్ కు ఎటువంటి ఇబ్బంది కలుగదు, అందువలన ప్రజలు అందరూ కూడా డీనిని పాటించండి అని పలువురు అధికారులు మరొక్కసారి ప్రజలను కోరుతున్నారు....!!!

మరింత సమాచారం తెలుసుకోండి: