ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 9 గంటలకు తొమ్మిది నిమిషాల పాటు దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇంట్లో లైట్లు అన్నీ ఆఫ్ చేసి కొవ్వొత్తులు, దీపాలు, ఫ్లాష్ లైట్లు వెలిగించాలని మోదీ పిలుపునిచ్చారు. ప్రజలు కరోనాపై పోరుకు స్పూర్తినిస్తూ ప్రతి ఇంటిలో దీపాలు వెలిగించాలని సూచించారు. జాతి ఐక్యతా సందేశం కోసం మోదీ దీపాలను వెలిగించాలని పిలుపునిచ్చారు. 
 
ప్రధాని మోదీ పిలుపుకు ప్రజలు సోషల్ మీడియా ద్వారా మద్దతు తెలుపుతున్నారు. లైట్లన్నీ ఆఫ్ చేసి దీపాలని వెలిగించి ఐక్యతను చాటి చెబుతామని కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. 130 కోట్ల మంది ప్రజలు ఒకేసారి లైట్లను ఆఫ్ చేస్తే ప్రపంచానికి మనం గొప్ప సందేశాన్ని ఇచ్చిన వాళ్లమవుతాం. జ్ఞానానికి కాంతి సంకేతం. ప్రజలంతా ఒకేసారి దీపాలను వెలిగించటం ద్వారా కరోనాతో ఏర్పడిన నిరాశ నుంచి ఆశ వైపుకు తీసుకెళ్లాలని మోదీ భావించారు. 
 
ప్రజలంతా ఆ దీపపు వెలుగులతో అంధకారాన్ని పారద్రోలటంతో పాటు... ఒంటరిగా లేమన్న సందేశాన్ని వినిపించాలి. 130 కోట్ల మంది ప్రజలు కరోనాను తరిమి కొట్టాలన్న సంకల్పంతో కరోనాను జయించడం అసాధ్యమేమీ కాదు. ఆరోగ్య భారతదేశం నిర్మాణానికి మన వంతుగా మనం కృషి చేయాలి. ఇప్పటికే దేశ ప్రజలు మోదీ పిలుపును స్వాగతించారు. ఈ మేరకు అన్ని చోట్ల ఏర్పాట్లు జరుగుతున్నాయి. 
 
మరోవైపు ఈరోజు వామన ద్వాదశి... మఖ, పుబ్బ నక్షత్రాల కలయిక కావడంతో ఈరోజు దీపం వెలిగిస్తే చెడు అంతం అవుతుందని శాస్త్రం చెబుతుంది. కేవలం అమ్మవారికి పూజించే వారికి మాత్రమే ఈరోజు దీపం వెలిగించడం వల్ల జరిగే మంచి తెలుస్తుందని ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా కరోనాపై పోరాడటానికి దేశ ప్రజలంతా సిద్ధంగా ఉన్నామని చెప్పేందుకు కచ్చితంగా పాల్గొని ఐక్యతను చాటి చెబుతూ మోదీకి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: