చైనాలోని పుహాన్ నుంచి పుట్టుకొచ్చిన కరోనా వైరస్ ఇప్పుడు 205 దేశాలకు విస్తరించి ముచ్చెమటలు పట్టిస్తుంది. చైనా తర్వాత ఇటలీ, ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్ ఇలా కొన్ని దేశాలక్లో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు.  విపరీతంగా కేసులు పెరిగిపోతున్నాయి.  అయితే మన దేశంలో కూడా కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించారు.  తాజాగా ఏపిలో గత ఐదు రోజలు నుంచి కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో సీఎం జగన్ ఈ విషయంపై సీరియస్ గా ఫోకస్ చేస్తున్నారు. తాజాగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ... లాక్ డౌన్ ప్రభావంతో సామాన్యుడు బయటకు రాలేని పరిస్థితుల్లో ఉండటంతో పేదలకు నిత్యావసరాలతో పాటు వెయ్యి రూపాయలు చొప్పున ఆర్థిక సాయం పంపిణీ చేస్తున్న ఏపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సరికాదని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు హితవు పలికారు.   

 

 

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్టుగా సీఎం జగన్ చెప్పుకుంటున్నారంటూ బీజేపీ నేతలు ఆరోపణలు చేయడం కరెక్టు కాదని అన్నారు.  తెల్లరేషన్ కార్దుదారులకు వెయ్యి రూపాయల చొప్పున ఇస్తున్న డబ్బులు రాష్ట్ర ప్రభుత్వానివేనని, ఇందుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు కూడా ఇటీవల విడుదలయ్యాయని గుర్తుచేశారు. 

 

ప్రతి విషయాన్ని ఇప్పుడు రాజకీయ కోణంలో చూడొద్దని ప్రజలు ఎన్నో కష్టాల్లో ఉన్నారని వారి బాగోగులు చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులకు ఉందని అన్నారు. తెల్లరేషన్ కార్డుదారులకు వెయ్యి రూపాయలు పంపిణీ చేసే సమయంలో ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని వాలంటీర్లు చెబుతున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు.

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: