కరొనా వైరస్ మహమ్మారి దేశంలో పెద్ద ఎత్తున విస్తరిస్తోంది. అలా ఇలా కాదు ఊపేసోంది. ఉప్పెనలా విరుచుకుపడుతోంది. లాక్ డౌన్ సమయంలోనే ఇంతలా ఉధ్రుతంగా ఉంటే ఆ తరువాత పరిస్థితి ఏంటన్నది చెప్పేందుకు పెద్దగా బుర్ర పెట్టన‌క్కర‌లేదు. దాంతో లాక్ డౌన్ లోనే టోటల్ గా  దేశాన్ని మరి కొన్ని నెలలు ఉంచడం అనివార్యంగా కనిపిస్తోంది.

 

ఇప్పటికైతే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర  ప్రభుత్వాలు లాక్ డౌన్ని కొనసాగించేందుకు రెడీ అయిపొయాయి. ఉత్తర ప్రదేశ్ విషయానికి వస్తే కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. ఇప్పటికైతే 250 పై చిలుకు కేసులు నమోదు అయ్యాయి. పక్కనే ఢిల్లీలో 450 వరకూ కేసులు ఉన్నాయి. నోయిడా, గురుగోవ్ వంటి చోట్ల కరోనా కరాళ న్రుత్యం చేస్తోంది.

 

ఈ నేపధ్యంలో కరోనాని కట్టడి చేయడంకోసం ఈ నెల 30 వరకూ యూపీలో లాక్ డౌన్ గడువు పెంచారు.  దాన్ని మరింతకాలం కొనసాగించే వీలు కూడా ఉంది. మరో వైపు దేశంలో కరోనా ఎఫెక్ట్ బాగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. అక్కడ 670 దాకా కేసులు ఇప్పటిదాకా నమోదు అయ్యాయి. 52 మంది మరణించారు. సీన్ చూస్తూంటే మాహారాష్ట్రలో కరోనా మహమ్మారి శాంతించేలా కనిపించడంలేదు.

 

ఆసియాలోనే అతి పెద్ద  మురికివాడ ధారవిలో రెండవ మరణం తాజాగా సంభవించింది. అక్కడ లక్షల్లో  పేదలు ఉంటారు. దాంతో అంటుకుంటే ఉప్పెనగా కరోనా వ్యాప్తి చెందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దాంతో సీఎం ఉద్ధవ్ ధాక్రే సైతం మహారాష్ట్రలో లాక్ డౌన్ని మరి కొంతకాలం పొడిగించాలనుకుంటున్నారుట.

 

ఈ రెండు రాష్ట్రాల బాటలోనే ఇపుడు దేశం మొత్తం పయనించే  అవకాశం ఉంది తక్కువలో తక్కువ అంటే జూన్  వరకూ లాక్ డౌన్ ఉంటుంది. లేకపోతే మరింతగా ముదిరిగే మాత్రం సెప్టెంబర్ వరకూ కూడా కరోనా కట్టడి కోసం దేశం మొత్తం తలుపు వేసుకోవాల్సిరావచ్చు.

 

ఇపుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా తీవ్రత దారుణంగా ఉంది కాబట్టి మరింతకాలం లాక్ డౌన్ తప్పదని అంటున్నరు. చూడాలి మరి. సెప్టెంబర్ దాకానా, జూన్ తో సరా అన్నది తేలాలిక‌. ఏది ఏమైనా మరో రెండు నెలలు మాత్రం లాక్ డౌన్ ఖాయమే అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: