దేశం మొత్తం కరోనా తో ఇబ్బందులు పడుతున్నారు.  ఉదయం లేచి రాత్రి పడుకునే వరకు కరోనా కేసుల తో భయపడి పోతున్నారు. ఎవరు ఎప్పుడు చనిపోతున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పంది.  కరోనా పై యుద్దం ప్రకటించిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించారు.  అయితే కొంత మంది మాత్రం లాక్ డౌన్ ఉల్లంఘిస్తున్నారు.  కొన్ని చోట్ల పోలీసులపై దాడులు కూడా నిర్వహిస్తున్నారు.

 

అయినా డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ద్య కార్మికులు మాత్రం తమ విధులు నిర్విరామంగా నిర్వహిస్తున్నారు.  ఈ మద్య కొన్ని చోట్ల కరోనా కేసుల నమోదై.. వారికి ట్రీట్ మెంట్ చేస్తున్న వారిపై దాడులు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కరోనా వైరస్ బారిన పడ్డ వారికి వైద్య సేవలందిస్తున్న వారిపై దాడుల నేపథ్యంలో తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఓ ప్రకటన  విడుదల చేశారు.  వైద్యులు, ఇతర అధికారులు, సర్వే సిబ్బందికి భద్రత నిమిత్తం మరిన్ని చర్యలు చేపట్టామని, మండలాల వారీగా, పోలీస్ స్టేషన్ల పరిధిలో వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేశామని చెప్పారు. 

 

ఎవరైనా దాడులకు పాల్పపడితే ఎట్టి పరిస్థితుల్లో  క్షమించే ప్రసక్తి లేదని అన్నారు.  హైదరాబాద్ లో మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు, వైద్యులు, జీహెచ్ ఎంసీ అధికారులతో పోలీస్ -మెడికల్ వాట్సప్ గ్రూప్ , ఆశా వర్కర్లు, హెల్త్ వర్కర్లతో మెడికల్ నోడల్ వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేశామని వివరించారు.  తమ హెచ్చరికలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వైద్యులు, ఆయా శాఖల సిబ్బందిపై ఎవరైనా దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేసి, వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు.

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: