వైయస్ జగన్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అప్పుల రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా ఉంటూ ఒకపక్క సంక్షేమాన్ని మరోపక్క అభివృద్ధిని సమపాళ్ళల్లో చేస్తున్న తరుణంలో ఒక్కసారిగా కరోనా వైరస్ రావడంతో పరిస్థితి అంతా తారుమారైంది. ప్రపంచంలో అనేక దేశాలలో ఆర్థిక మాంద్యం పూర్తిగా దెబ్బతింది. ఇదే పరిస్థితి భారతదేశంలో కూడా నెలకొంది. దీంతో ఇప్పటికే విభజన ఎఫెక్ట్ మరియు అప్పుల ఊబి తో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మాంద్యం పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు అయింది. ఈ నేపథ్యంలో ఒక పక్క కరోనా సమస్య ఎదుర్కొంటూనే మరోపక్క పరిపాలన చేస్తున్నారు సీఎం వైఎస్ జగన్. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉద్యోగాల వేతనాల్లో రెండు విడతల్లో జీతం ఇస్తున్నట్లు జగన్ సర్కార్ పేర్కొంది. దీనికి కారణం ఆర్థికమాంద్యం అని వివరించింది.

 

దీంతో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగస్తులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు అంట. మామూలుగా అసలు విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడూ కూడా ఆర్థికమాంద్యంతో అవస్థలు పడలేదని ఉన్న కొద్ది ఆర్ధికంగా ఎదిగి బలపడుతుందని ప్రభుత్వ ఉద్యోగస్తులు కామెంట్ చేస్తున్నారు.

 

కానీ ప్రస్తుత పరిస్థితికి కారణం ప్రభుత్వం ప్రకటించిన ఉచిత పథకాలు వలన అప్పులు పెరిగాయని ఇందువల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం ఏర్పడిందని అంటున్నారు. దీంతో వైయస్ జగన్ ని తీవ్రస్థాయిలో అపార్థం చేసుకుంటున్నారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగస్తులు. మరోపక్క కొంతమంది నిజంగా కష్టాల్లో ఉండబట్టే ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలు జేఏసీ ప్రభుత్వం తో జరిపిన చర్చల్లో ఓకే చెప్పిందని..ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇది కూడా గమనించాలి అని మరోపక్క వాదన వినబడుతోంది. 



క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple.

మరింత సమాచారం తెలుసుకోండి: