ప్రపంచం వణికిపోతోంది కరోనా వైరస్ గురించి. అటువంటి కరోనా వైరస్ అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికా ని అతలాకుతలం చేసి పారేసింది. ఈ వైరస్ వల్ల చాలామంది చనిపోవడం జరిగింది. ప్రపంచంలోనే పది లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే 50 వేలకు పైగానే మరణాలు సంభవించాయి. ఎక్కువగా పాజిటివ్ కేసులు అమెరికాలో నమోదు అవుతుండగా మరణాల విషయంలో ఇటలీ మరియు స్పెయిన్ ప్రాంతాలలో ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇండియా లో ఈ వైరస్ ప్రభావం ఎక్కువ ప్రబలకుండా కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తగా 21 రోజులపాటు లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది.

 

దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని చాలా పటిష్టంగా కఠినంగా అమలు చేశాయి. ప్రజలెవరూ ఇల్లు దాటి బయటకు రాకుండా చాలా జాగ్రత్తలు వహించారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఆశావర్కర్ల పనితనం అయితే అభినందనీయమని చెప్పవచ్చు. తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం చెప్పిన ప్రతి పని చేస్తూ ఎంతగానో కృషి చేశారు.

 

ముఖ్యంగా ఢిల్లీ నిజాముద్దీన్ దర్గా ప్రాంతాలకు వెళ్లిన వారికి వైరస్ వచ్చినట్లు తేలడంతో వారి వివరాలను కనుక్కునే తరుణంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా గాని అద్భుతంగా పని చేయడం జరిగింది. దీంతో ఆశ వర్కర్ల కి పాలాభిషేకం చేసిన తప్పు లేదని అంత బాగా కృషి చేశారని రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు కామెంట్ చేస్తున్నారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple.

మరింత సమాచారం తెలుసుకోండి: