దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా గురించిన చర్చలే నడుస్తున్నాయి.  సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ కరోనా కష్టాలు తప్పడం లేదు.  తాజాగా ఈ కరోనాను అరికట్టడానికి దేశంలో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో దేశంలో ఈ రోజు రాత్రి 9 గంటల 9 నిమిషాలకు ప్రతి ఒక్కరూ లైట్స్ ఆఫ్ చేసి దీపంతో సంఘీభావం తెలపాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రెటీలు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రధానికి సంఘీభావం తెలుపుతున్నారు.

 

  తాజాగా ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చిన్నజీయర్ స్వామి స్పందించారు. ప్రధాని మోదీ పిలుపును పాటిద్దామని అన్నారు. దీపాలు వెలిగించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని, దేశానికి ఉపయోగపడే పనులు చేయడంలో అందరం కలసికట్టుగా సాగాలని తెలిపారు.  అయితే మనం మనకోసం కాదు.. వేల మందికోసం ఇప్పుడు పోరాడుతున్నాం.. ఈ సమయంలో అందరూ బాధ్యతాయుతంగా ఉండాలని అన్నారు. 

 

ప్రధాని మనల్నేమీ కొండలు ఎత్తమనలేదు, కషాయం తాగమని చెప్పలేదు. గుంజీలు తీయమని అంతకన్నా చెప్పలేదు. రాత్రిపూట 9 గంటలకు 9 నిమిషాల పాటు దీపాలు వెలిగించమని చెప్పారు. దీపాలు వెలిగించడం ఎంతో మంగళకరం. దేశమంతా ఒక్కటేనన్న భావన అందరిలో కలిగించే ప్రయత్నమిది.  మంచి నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపాలు వెలిగిస్తే వాతావరణం ఎంతో హాయిగా ఉంటుంది అని వివరించారు.

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: