ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయనే విషయం తెలిసిందే. రాష్ట్రంలో బాధితుల సంఖ్య 226కు చేరింది. రాష్ట్రంలో ఈరోజు 34 కొత్త కేసులు నమోదయ్యాయి. సీఎం జగన్ ఈరోజు రాష్ట్రంలో కరోనా నియంత్రణ కోసం సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డీజీపీ గౌతమ్ సవాంగ్, నీలం సాహ్ని, ఉన్నతాధికారులు హాజరయ్యారు. 
 
ఈ సమావేశంలో కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, నిత్యావసరాల పంపిణీ, ఇతర విషయాల గురించి ప్రధానంగా చర్చ జరిగింది. సీఎం జగన్ ఈ సమావేశంలో అధికారులకు ప్రతి ఆస్పత్రిలో కచ్చితంగా ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. కరోనా లక్షణాలు ఎవరిలోనైనా కనిపిస్తే అతనిని కరోనా సోకిన వ్యక్తిగానే భాకించి చికిత్స అందించాలని చెప్పారు. గతంలో దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసిందని ఆ ఆదేశాలు అమలయ్యేలా చూడాలని చెప్పారు. 
 
ఎవరైనా ఢిల్లీకి వెళ్లినట్లు తేలితే వారికి వేగంగా పరీక్షలు జరిగేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. రాష్ట్రంలో నిరంతరాయంగా ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితి గురించి సర్వే జరగాలని చెప్పారు. దేశంలో లాక్ డౌన్ పొడిగింపు గురించి సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ ఏప్రిల్14 తర్వాత ఇచ్చే ఆదేశాల ఆధారంగా తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధం కావాలని సూచనలు చేశారు. 
 
మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా గత నాలుగు రోజుల నుంచి లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలవుతున్నాయి. కొత్త కేసులు నమోదు కాకుండా ఉండటం కోసం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. రాష్ట్రవాప్తంగా వాలంటీర్లు, ఆశావర్కర్లు నిరంతరం సర్వేలు చేస్తూ కరోనా కట్టడి కోసం కృషి చేస్తున్నారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: