కరోనా వైరస్ వ్యాప్తించే విషయంలో దేశప్రజలు ఏదైతే జరగకూడదని కోరుకుంటున్నారో మహారాష్ట్రలో అదే జరగబోతోందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఇప్పటికి  రాష్ట్రంలో వైరస్ బాధితుల సంఖ్య 700 దాటిపోయింది. 34 మంది మరణించారు.  దేశం మొత్తం మీద బాధితులైనా మరణాలైన ఎక్కువగా రికార్డయింది మహారాష్ట్రలోనే. అందుకే ఈ రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత మూడోస్టేజిలోకి వెళిపోతోందా అనే అనుమానాలు పెరిగిపోతోంది. రాష్ట్రంలో పెరిగిపోతున్న తీవ్రత చూసి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల్లో టెన్షన్ పెరిగిపోతోంది.

 

నిజానికి దేశంలోని ఇతర రాష్ట్రాల్లోలాగే మహారాష్ట్రలో కూడా నాలుగు రోజుల కిందటి వరకూ వైరస్ ప్రభావం ఇంత తీవ్రంగా లేదనే చెప్పాలి. ఎప్పుడైతే ఢిల్లీలోని మర్కజ్ మసీదు ప్రభావం మొదలైందో మహారాష్ట్రలో తీవ్రత  ఒక్కసారిగా పెరిగిపోయింది. మార్చి 1-15 తేదీల మధ్య ఢిల్లీలోని మసీదులో ప్రార్ధనల్లో పాల్గొనేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి సుమారు 12 వేలమంది ఢిల్లీలో కొద్ది రోజులున్నారు. అక్కడి నుండి తిరిగి వాళ్ళ రాష్ట్రాలకు వెళ్ళిపోయిన వారిలో కొందరు మహారాష్ట్రకు చేరుకున్నారు.

 

ఎప్పుడైతే ఢిల్లీ నుండి రాష్ట్రాలకు చేరుకున్నారో అప్పటి నుండి ఆయా రాష్ట్రాల్లో  వైరస్ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ఇందులో భాగంగానే మహారాష్ట్రలో కూడా ఒక్కసారిగా బాధితుల సంఖ్య పెరిగిపోయింది. ప్రార్ధనల పేరుతో ఢిల్లీకి వెళ్ళిన వారు విదేశాల నుండి వచ్చిన సుమారు 1500 మంది నుండి వైరస్ ను అంటించుకుని వచ్చి తమ రాష్ట్రాల్లో ఇతరులకు అంటించటంతోనే  సమస్య పెరిగిపోయింది.

 

ఇప్పటికి మహారాష్ట్రలో 700కి పైగా కేసులు నమోదవ్వటమే కాకుండా 34 మంది మరణించారంటే మామూలు విషయం కాదు. కమ్యూనిటి ట్రాన్స్ మిషన్ ప్రబలకుండానే ప్రభుత్వం ముందు జాగ్రత్తగా మూడు వారాల లాక్ డౌన్ విధించింది. అయితే కొందరు ఆ నిబంధనను ఉల్లంఘింయచిన కారణంగానే చాలా రాష్ట్రాల్లో లాగే మహారాష్ట్రాలో కూడా కేసులు పెరిగిపోతున్నాయి.  స్పీడు చూస్తుంటే మహారాష్ట్రలో ముందు ముందు వైరస్ బాధితుల సంఖ్య మరింతగా పెరిగిపోతోందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అంటే మూడోస్టేజిలోకి రాష్ట్రం వెళిపోతోంది. నిజంగా అదే జరిగితే బాధితుల సంఖ్యను ఊహిచటం కూడా కష్టమే.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: