కరోనా వైరస్‌... దీని దెబ్బకి ఒక్కో దేశం ఒక్కో రకంగా పోరుడౌతుంది ఈ మహమ్మారిని తరమడానికి. దీని నివారణ మందు కోసం ప్రపంచం వ్యాప్తంగా మొత్తం పరిశోధనలు గట్టిగా సాగుతున్నాయి. కాకపోతే ప్రస్తుతం ఇప్పుడు కరోనాకు మందు కొనుగొన్నట్టు ఒక పరిశోధన పత్రం తెలుపుతుంది. అది ఎక్కడ ఏమిటంటే... ఆస్ట్రేలియా దేశానికీ చెందిన సైంటిస్టులు యాంటీ పారాసిటిక్ డ్రగ్‌ ను అక్కడి ల్యాబ్‌ లో అభివృద్ది చేసిన SARS-CoV-2 వైరస్‌ మీద ప్రయోగించారు. 

 

 

ఇలా ప్రయోగించిన తర్వాత .... ఆ డ్రగ్ కేవలం 48 గంటల్లోనే కరోనా వైరస్‌ ను చంపేసినట్టు పరీక్షల్లో బయటికి వచ్చింది. " Ivermectin " అనే FDA ఆమోదం పొందిన డ్రగ్ hiv, డెంగ్యూ, ఫ్లూ, జికా వైరస్ లాంటి వైరస్ ల వాటి మీద కూడా బలంగా పనిచేస్తోందని అక్కడి సైంటిస్టులు గుర్తించారని వారు తెలిపారు. ఆస్ట్రేలియా దేశంలోని మోనాష్ యూనివర్సిటీ నుంచి ఈ పరిశోధన పత్రం " యాంటీ వైరల్ రిసెర్చ్ " అనే జర్నల్‌ లో ప్రచురించడం జరిగింది. 

 


" Ivermectin " కేవలం సింగల్ డోస్ కరోనా వైరస్ ను వృద్ది చెందకుండా ఆపుతున్నట్టు అందులో తెలిపింది. అయితే ఆస్ట్రేలియా కేవలం రెండు అంటే రెండు రోజుల్లో మొత్తం వైరస్‌ ను అంతం చేసినట్టు అందులో తెలిపింది. " Ivermectin " సింగల్ డోస్ వైరల్ RNA ను 48 గంటల్లోనే పూర్తిగా అంతం చేసినట్టు గుర్తించాం అని వారు తెలుపుతున్నారు. ఇంకో విషయం ఏమిటంటే కేవలం 24 గంటల్లో వైరస్ ని బాగా తగ్గించగలిగిందని ఈ పరిశోధనలకు నాయకత్వం ఉన్న " డాక్టర్ కైల్ వాగ్‌స్టాఫ్ " దీనిని వివరించారు.

 

 

కాకపోతే, ప్రస్తుతం ఈ టెస్టులు ల్యాబ్‌ లో మాత్రమే జరుగుతున్నాయని, ఇక పై దీనిని మనుషులపై ప్రయోగించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. "Ivermectin "  అనేది ఒక సేఫ్ డ్రగ్‌. కాకోపోతే, మనుషుల మీద ఎంతమేరకు ఇది ఎంతవరకు ప్రభావంగా పనిచేస్తుందనేది చూడాలని వాగ్ స్టాఫ్ అన్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఈ మందుకు ఆమోదం వస్తే అది ప్రజలకు తొందరగా చేరుతుందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: