కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ, భారతదేశం మొత్తం లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక ఇటు ఏపీలో కూడా కరోనా కేసులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో జగన్ ప్రభుత్వం లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. అయితే ఈ లాక్ డౌన్ వల్ల పేదలకు ఉపాధి ఆగిపోయింది. రోజువారి కూలి పనులకు వెళ్లేవారికి కష్టాలు ఎదురయ్యే పరిస్థితి ఉంది. అందుకే ఏపీ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి రూ.వెయ్యి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. గత రెండు రోజుల నుంచి వార్డు, గ్రామ వాలంటీర్లు ఇంటింటీకి వెళ్లి లబ్ధిదారులకు నగదు అందజేస్తున్నారు. రాష్ట్రంలో కోటి 30 లక్షల కుటుంబాలకు ఆర్థిక సాయం అందనుంది.

 

అయితే ఈ వెయ్యి రూపాయలు సాయంపై నానా రచ్చ జరుగుతుంది. అసలు ఈ వెయ్యి రూపాయలు కేంద్రం ఇచ్చే సాయమని బీజేపీతో పాటు టీడీపీ నేతలు వాదిస్తున్నారు. అలాగే వెయ్యి రూపాయలని వైసీపీ కార్యకర్తలు, నాయకులు పంపిణీ చేస్తారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇంకా స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబడిన అభ్యర్ధులు ఈ డబ్బులని పంచుతూ, వైసీపీకి ఓటు వేయాలని ప్రజలని కోరుతున్నట్లు వీడియోలు కూడా సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి.

 

ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ రమేశ్ కుమార్ కూడా లేఖ రాశారు. కేంద్రం ఇచ్చే సాయాన్ని తాము ఇస్తున్నట్లుగా చెప్పుకుంటూ, వైసీపీకి ఓటు వేయాలని కోరుతున్నారని, ఇక అలాంటి వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే దీనిపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడా కౌంటర్ ఇచ్చారు. వైసీపీకి ఓటు వేయాలని వీడియోలు సృష్టించారని, అయినా వెయ్యి రూపాయలు కేంద్రానివో, రాష్ట్రానివో కాదని ప్రజలవని అంబటి గట్టిగానే చెప్పారు.

 

అయితే అంబటి చెప్పిన లాజిక్ చాలా కరెక్ట్, ఆ డబ్బు ఎవరు ఇచ్చిందో కాదు. అది అంతా ప్రజల డబ్బు. పైగా కేంద్రం, 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రెవెన్యూ లోటు కింద నిధులు విడుదల చేసిందే తప్ప, ప్రత్యేకంగా ఏమి సాయం చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: