ఇప్పటి కే  ప్రపంచాన్ని కదిలించి వేసిన ఈ కరోనా వైరస్ మహమ్మారి ప్రజల ను అనుక్షణం భయపడే లా చేస్తుంది. అంతేకాక దేశవ్యాప్తంగా పాకుతూ వస్తుంది. అయితే ఈ మహమ్మారిని ఆదిలోనే త్రుంచివేయాలని ప్రభుత్వం కట్టు దిద్దమయిన చర్యలను  చేపడు తూ వస్తుంది. ఈ మేరకు లాక్ డౌన్ ను ప్రకటించారు. ఇక పోతే దేశవ్యాప్తం గా లాక్ డౌన్ కొన సాగుతుంది.. 

 

 

 

అయితే జనాలు బయట ఎక్కడ ఎక్కువగా తిరగ కుండా కఠిన చర్యలు తీసుకుంటూ ఏప్రిల్ 14 వ తేదీ వరకు లాక్ డౌన్ ను ప్రకటించింది..ఈ మేరకు ప్రజలు ఎక్కడా బయట తిరగడం లేదని అర్థమవుతుంది.. ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటూ ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు విరాళాలను అందిస్తున్నారు.. కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న సినిమాలు వాయిదా పడ్డాయి. 

 

 

 

తెరకెక్కుతున్న ఎన్నో సినిమాలు , సీరియల్స్ ఆగిపోయాయి ..అలాగే టీవీ షో కూడా ఆగిపోయిన సంగతి  తెలిసిందే.. అందరు ఇంట్లో  కూర్చొని వంట, ఇంటిపని చేసుకుంటూ వస్తున్నారు. ఇకపోతే సినిమా వాళ్ళు ఇంట్లో ఉంటూ  పెట్టారు. అలా వాళ్ళు చేస్తున్న వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు.. 

 

 


మరో ముఖ్య మైన విషయం ఏంటంటే ఈరోజు ఈ సందర్భంగా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించింది. రాత్రి తొమ్మిది గంటలకు అందరు ఇంటి పైకి వెళ్లి దీపాలను వెలిగించాలని పిలుపు నిచ్చారు. ప్రమిదలలో దీపాలు వెలిగించే ముందు, లేదా కొవ్వొత్తులు వెలిగించేముందు పౌరులు తమ చేతులను సబ్బుతో  మాత్రమే శుభ్రంగా కడుక్కోవాలని, ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్లతో వద్దని హెచ్చరించింది. ఆల్కహాల్ కు మండే స్వభావం ఉన్న కారణంగా దీంతో తయారు చేసిన శానిటైజర్లను వాడకూడదని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: