చైనాలో పుట్టిన మహమ్మారి కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. అసలు ఏ మాత్రం కనికరం లేకుండా ఈ వైరస్ ప్రపంచం మొత్తాన్ని చుట్టేసింది. ఇప్పటివరకు 12 లక్షల మందికి పైనే కరోనా బారిన పడగా, 66 వేలకు పైనే చనిపోయారు. ముఖ్యంగా ఈ కరోనా అమెరికా దేశంలో బీభత్సం సృష్టిస్తుంది. ఆ దేశంలో 3 లక్షల మందికి పైనే కరోనా బారిన పడ్డారు.

 

ఇక అమెరికా తర్వాత ఈ కరోనా స్పెయిన్‌ని వణికిస్తుంది. ఆ దేశంలో కరోనా కేసులు లక్ష ముప్పై వేలకు పైనే ఉన్నాయి. అలాగే 12 వేలకు మందికి పైనే చనిపోయారు. అయితే ఇలా కరోనా విజృంభిస్తున్న సమయంలోనే కొన్ని దారుణమైన ఘటనలు స్పెయిన్‌లో చోటు చేసుకుంటున్నాయి. ఆ దేశంలో ఏ మాత్రం మానవత్వం లేకుండా వృద్ధులని మనుషులుగా కూడా చూడటం లేదు.

 

రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోవడంతో హాస్పిటల్స్ నిండిపోతున్నాయి. దీంతో అక్కడ మిగతా వయసు వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తూ, ముసలి వాళ్ళని హాస్పిటల్స్ నుంచి పంపించేస్తున్నారు. ఇక కరోనా మహమ్మారితో బాధపడుతూ, హాస్పిటల్స్‌కు వచ్చిన వాళ్ళని నిర్దాక్షిణ్యంగా బయటకు పంపేస్తున్నారు. ఇక ఈ విషయంపై అక్కడి ప్రభుత్వం కూడా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. భవిష్యత్‌కు పునాదులు వేసిన వృద్ధులని పట్టించుకోకుండా వారిని దారుణంగా చూస్తున్నారు.

 

ఇదే సమయంలో సంరక్షణ గృహాల్లో ఉంటున్న వృద్ధులు పరిస్థితి మరి దారుణంగా ఉంటుంది. అక్కడ వారిని చూసుకునేందుకు ఎవరూ ఉండటం లేదు. దీంతో వారి బాధలు వర్ణాతీతం. పైగా అందులో చాలామంది కరోనాతో బాధపడుతున్నవారు ఉన్నారు. ఇక దాని వల్ల మిగతా వాళ్ళకు కరోనా సోకి చాలామంది ముసలి వాళ్ళు పిట్టల్లా రాలిపోతున్నారు. అలా అనాథలుగా చనిపోయినవారిని కూడా ప్రభుత్వం లెక్కలోకి తీసుకోవడం లేదు. ఏదో హాస్పిటల్స్‌లో కరోనాతో మరణించేవారినే లెక్కలోకి తీసుకుంటున్నారు. ఏదేమైనా ఇలా ముసలి వాళ్ళని పట్టించుకోపోవడం చాలా దారుణం.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: