ప్రధాన నరేంద్ర మోడీ ఇంతకుముందు భారత దేశ ప్రజలంతా పోలీసులకు, హెల్త్ వర్కర్లకు ఇంకా ఎవరైతే కోవిడ్ 19 నిర్మూలన కొరకై అహోరాత్రులు శ్రమ పడుతున్నారో వారిని అభినందించేందుకు ఇళ్ల నుండి బయటికి వచ్చి చప్పట్లు కొట్టడం, వంట సామాగ్రి తో చప్పుళ్ళు చేయడం లాంటివి చేయమన్నారు. వాస్తవానికి ఈ ఐడియా స్పెయిన్ దేశస్థులు అది. కానీ అది మన దేశంలో చేయించడం అత్యవసర సేవలందించే వర్కర్లకు ఓ బూస్ట్ గా నిలిచింది. అందుకుగాను ప్రధాన నరేంద్ర మోడీ ని మనం మెచ్చుకోవచ్చు. ఇటీవల ఆయన ఆ వీడియో సందేశం ద్వారా ఈరోజు అనగా ఆదివారం రాత్రి 9 గంటల 9 నిమిషాల కు మన ఇళ్ళ విద్యుద్దీపాలను ఆర్పేసి... బాల్కనీలోకి వచ్చి ఫోన్ టార్చ్ ఆన్ చేయడం లేకపోతే దీపాలు/కొవ్వొత్తులను వెలిగించి కరోనా పై మనం గెలిచినట్టే అని సంబరాలు చేసుకోమన్నారు.


నిజానికి ఈ ఐడియా ని మొట్టమొదటగా ఫాలో అయ్యింది బ్రెజిల్ దేశం. మార్చి 28 వ తేదీన ఆ దేశ ప్రజలంతా తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఫోన్ టార్చ్ ఆన్ చేసి మేము కరోనా పై దాదాపుగా గెలిచాము, త్వరలోనే గెలుస్తాము అని గట్టిగా మనసులో తలుచుకున్నారు. ఇలా అందరూ ఒకేసారి తలుచుకోవడం వలన లా ఆఫ్ అట్రాక్షన్ అనే ఓ అద్భుత శక్తి పనిచేస్తుంది. ఉదాహరణకి మనమందరం ప్రార్థనలు, పూజలు చేస్తూ మన కోరికలు నెరవేరాలని పదేపదే అనుకుంటాం. ఇలా అనుకోవడం వలన కొన్ని కోరికలు జరుగుతుంటాయి. అందుకే మన పూర్వీకులు పూజలు, ప్రార్థనలు లాంటివి చాలా గొప్పవని ఏదైనా పని జరగాలంటే అవి కచ్చితంగా చేయాలని దేవుని పేరుతో మనకు తెలియ జేసారు.


ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ కూడా మన భారత ప్రజలందరినీ కొవ్వొత్తులు/ దీపాలు వెలిగిస్తూ... 'మనం త్వరలోనే కరోనా మహమ్మారిపై గెలుస్తాం' అని అనుకోమన్నారు. తాజాగా అల వైకుంఠపురములో హీరోయిన్ పూజా హెగ్డే కూడా మన పాజిటివ్ ఆలోచనకి చాలా శక్తి ఉందని... అందుకే ప్రతి ఒక్కరూ కొవ్వొత్తులను వెలిగించి కరోనా పై జయించామనే విశ్వాసంతో కూడిన ఆలోచన చేయాలని అన్నారు. సో, కరెక్ట్ గా 9 గంటల 9 నిమిషాల కు అందరూ ఐక్యంగా దీపాలను/ కొవ్వొత్తులను వెలిగిస్తూ కరోనా పై జయించామని తలచుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: