కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచంలో చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒక్కసారిగా తలకిందులు అయిపోయాయి. ముఖ్యంగా ఈ వైరస్ వల్ల ఎక్కువగా నష్టపోయింది యూరప్ మరియు అగ్రరాజ్యం అమెరికా దేశం. ప్రపంచ ఆర్ధిక రంగంలో బలమైన దేశాలుగా పేరు సంపాదించిన యూరప్ మరియు అమెరికా దేశాలు ఇప్పుడు ఈ కరోనా వైరస్ దెబ్బకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అక్కడ వాతావరణం వైరస్ కి బలంగా సహకరించడంతో ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. ఇండియాలో కూడా కరోనా వైరస్ దెబ్బకు ఆర్థికమాంద్యం చాలా వరకు నష్టపోయింది.

 

ఇదే తరుణంలో విభజన తో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా కరోనా వైరస్ కాటుకు తీవ్రస్థాయిలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇటువంటి తరుణంలో ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా ఒకేసారి నెల జీతాలు ఇచ్చే పరిస్థితి ప్రస్తుతం కనబడటం లేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలో పాదయాత్రలో ప్రజలకు భారీస్థాయిలో హామీలు ఇవ్వడంతో... వాటిని అమలు చేయడానికి కోట్లలో డబ్బులు అవసరం కాబోతున్న తరుణంలో జగన్ సర్కార్ కి సరికొత్త కష్టకాలం ఏర్పడింది.

 

ఇటీవల బడ్జెట్ రిలీజ్ అయిన 30 వేల కోట్ల రూపాయలు అదనంగా వచ్చిన గాని...ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో ఇంకా అదనంగా డబ్బులు అవసరం వస్తుందట. దీంతో ఇప్పుడు జగన్ సర్కార్ ఎవరు లోన్ ఇస్తారు అన్న వేటలో పడినట్లు ఏపీ రాజకీయాల్లో సరికొత్త వార్తలు వినపడుతున్నాయి. అయితే ఇదే సమయంలో గత ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో అప్పుడు చేయటంతో ...రాష్ట్రానికి లోన్ ఇచ్చే పరిస్థితి ఏ బ్యాంకుకు లేదని మరి కొంతమంది రాజకీయ వేత్తలు అంటున్నారు.



క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: