కరోనా చీకటిపై దీపాల వెలుగులతో యుద్దం చేద్దామ‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ ఇచ్చిన పిలుపు మేర‌కు స‌మ‌స్త భార‌తావ‌ని దీపాలు వెలిగించి సంఘీభావం తెలిపింది. ఇందులో భాగంగా, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో దీపాలు వెలిగించి సంఘీభావం తెలిపారు. ఆయ‌న మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రులు సైతం ఇదే రీతిలో త‌మ సంఘీభావం వ్య‌క్తం చేశారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు కొండాపూర్‌లోని తన నివాసంలో‌ ఆర్థిక మంత్రి హరీశ్ రావు తన కటుంబ సభ్యులతో  దీపాలు వెలిగించి‌ కరోనా చీకటి పై సమరభేరి మోగించారు‌. ఈ దీపపు వెలుగులు‌  కరోనా  చీకటిపై యావత్ భారత ప్రజల‌ విజయానికి సంకేతంగా అభివర్ణించారు. ఈ వెలుగుల తో‌ కరోనా ను ప్రపంచ పొలిమేరలు‌దాటిద్దామన్నారు. సామాజిక దూరం పాటించి...మన ఇళ్లలో ఉండి కోరనా పై యుద్దం చేయాలని పిలుపునిచ్చారు.

 


ప్రధాని నరేంద్ర మోడీ పిలుపులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా లైట్లు అర్పివేసి దీపాలు వెలిగించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశంతో శ్రీనగర్ కాలనీలోని నివాసంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దీపాలు వెలిగించారు. కరోనా నుండి భారత్‌ను విముక్తి చేయటంలో భాగంగా రాత్రి 9 గంటలకు ఈ కార్యక్రమంలో మంత్రి సబితా రెడ్డి కుటుంబ‌ సభ్యులతో పాల్గొన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశం అంత ఒక్కతాటిపై నిలబడాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు.ఒకే సమయంలో లైట్లు అపి వేసి దీపాలు వెలిగించి ఐక్యమత్యాన్ని చాటిన ప్రజలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. కరోనా నివారణకు విశేషంగా కృషి చేస్తున్న వైద్యులకు,నర్సులకు, పార మెడికల్ సిబ్బంది కి,పోలీస్ ఇతర శాఖల వారి కృషి యావత్ భారతవని  కీర్తిస్తుందని,వారి వెంట ప్రజలు ఉంటారన్నారు.

 


ప్ర‌ధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు కరోనా వైరస్‌పై జరుగుతున్న పోరాటానికి సంఘీభావం తెలుపుతూ రాష్ట్ర న్యాయ‌శాఖ‌  మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి కుటుంబ స‌మేతంగా ఆదివారం  మ ఇంట్లోని విద్యుత్‌ దీపాలను ఆపి వేసి దీపాలు వెలిగించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపుతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఈరోజు రాత్రి మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ తన కుటుంబ సభ్యులతో కలిసి వెస్ట్ మారేడ్ పల్లి లోని నివాసం వద్ద దీపాలను వెలిగించారు.

 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు తన‌ అధికారిక నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్ర శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి దీపాలు వెలిగించారు.  కరోనా మహమ్మారి పై పోరుకు సంఘీభావ సంకేతంగా, ప్రజల ఐక్యతను చాటేలా చెప్పడమే ఈ దీపాలు వెలిగించే కార్యక్రమం ఉద్దేశం అని స్పీకర్ త‌న సందేశంలో తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: