దేశమంతా వైరస్ సోకి ప్రాణాలు పోతుంటే.. ఆ కరోనా మతం ముసుగు కూడ వేసుకుని మరోదారిలో ప్రాణాలు తీస్తుంది.. ఇప్పటికే లోకంలో జరుగుతున్న కరోనా దారుణాలు చాలవని కొందరు మత ప్రస్తావనతో నిండుప్రాణాలను తీస్తున్నారు.. ఇద్దరు వ్యక్తుల మధ్య ఏ విషయం అయితే వివాదానికి దారితీస్తుందని అనిపిస్తుందో.. ఆ సమయంలో పరిస్దితులు మరింత ముదురక ముందే ఆ టాపిక్ కట్ చేయాలి కాదని దాన్ని పొడగించుకోవాలని చూస్తే ఇదిగో ఇలాగే జరుగుతుంది..

 

 

ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్‌లో వెలుగుచూసిన ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇంతకు ఏం జరిగిందంటే.. ప్రయాగ్‌రాజ్ జిల్లాలోని కరేలీ పరిధి బక్షి మొదా గ్రామానికి చెందిన లోతన్ నిషాద్ (30) అనే వ్యక్తి ఇంటి సమీపంలో ఇతని స్నేహితులతో కలిసి కూర్చుని కరోనా వ్యాప్తిపై చర్చించు కుంటుండగా దానిలోకి మర్కజ్ ఘటన ప్రస్తావనకు వచ్చింది...

 

 

అందులో నిషాద్.. ఢిల్లీలో జరిగిన ఓ ఘటన కారణంగానే దేశంలో కరోనా వ్యాప్తి చెందిందని వాదించడంతో అదే గ్రామానికి చెందిన మహమ్మద్ సోనా అలియాస్ సోనుతో పాటు మరో వ్యక్తి కి ఆగ్రహం తెప్పించింది. వారి మధ్య మాట మాట పెరిగి వివాదం ముదిరడం తో సోను తుపాకీతో నిషాద్‌పై కాల్పులు జరిపాడు. దీంతో అక్కడికక్కడే నిషాద్ కుప్పకూలి మరణించాడు..

 

 

అనంతరం ఇద్దరు నిందితులు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా స్థానికులు సోనుని పట్టుకుని చితక్కొట్టి పోలీసులకు సమాచారం అందించడంతో హుటా హుటిన గ్రామానికి చేరుకున్నవారు అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. చూశార కరోనా.. మతం ముసుగులో మరో ప్రాణాన్ని బలిగొంది.. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: