ప్రధాని నరేంద్ర మోదీ కరోనాపై పోరులో భాగంగా ఇచ్చిన పిలుపు మేరకు దేశ‌వ్యాప్తంగా ఆదివారం రాత్రి సరిగ్గా రాత్రి 9 గంటల సమయంలో విద్యుత్‌ బల్బులను ఆర్పి కొవ్వొత్తి వెలిగించి సంఘీభావం ప్రకటించారు. తెలంగాణ‌లో కూడా ప‌లువురు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కుటుంబసభ్యులతో కలిసి కొవ్వొత్తి వెలిగించారు. ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దీపాలు వెలిగించారు.  ప్రగతిభవన్‌లో మంత్రి ఈటెల రాజేందర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, ఉన్నతాధికారులు కూడా కొవ్వొత్తులు  వెలిగించి పట్టుకున్నారు.

 

ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌ కల్వకుంట్ల కవిత  ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ గారి పిలుపు మేరకు కుటుంబ సభ్యులతో కలిసి దీపాలను వెలిగించారు. సామాజిక దూరం పాటించి, ఇళ్లలో ఉండి కోరనా పై యుద్దం చేయాలని కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో దేశమంతా ఒక్కటై సంకల్ప బలాన్ని ప్రదర్శించి, మన‌ ఐక్యత, క్రమశిక్షణను ప్రపంచానికి చాటి చెప్పాలని కవిత పిలుపునిచ్చారు. కాగా, కరోనా వైరస్ పోరుకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి లైట్లు ఆర్పేసినా విద్యుత్ కు సంబంధించి లాంటి ఇబ్బందులు లేకుండా చేసిన విద్యుత్ శాఖను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు

 

కరోనాపై దేశం సమిష్టిగా చేస్తున్న యుద్ధానికి సంఘీభావంగా దీపాలు వెలిగించాలని సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలను కోరిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. అయితే, ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు మంత్రి కేటీఆర్ పాలు పంచుకోక‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆధ్యాత్మిక భావాలు లేని వ్య‌క్తి కేటీఆర్ అని ఆయ‌న‌ గురించి తెలిసిన వారు పేర్కొంటుంటారు. దీంతో స‌హ‌జంగానే కేటీఆర్ ఇందులో పాల్గొన‌లేద‌ని ప‌లువురు అంచ‌నా వేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: