ప్రపంచంలో కరోనా మహమ్మారి ఎంత బీభత్సం సృష్టిస్తుందో ప్రతిరోజూ వార్తల్లో చదువుతూనే ఉన్నాం.  చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన ఈ మాయదారి భయంకరమైన కరోనా వైరస్ మనిషి మనుగడనే ప్రశ్నిస్తుంది.  ఈ నేపథ్యంలో భారత్ లో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  నేడు ప్రధాని కరోనాని అరికట్టే పనిలో 9 గంటల 9 నిమిషాలకు లైట్స్ క్లోజ్ చేసి దీపాన్ని వెలిగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  క‌రోనా చీక‌ట్ల‌ను చీల్చుకుంటూ దీపాలను వెలిగించారు . దేశ‌మంతా దివ్య‌జోతులు వెలిగాయి.   ప్ర‌మిదలు.. కొవ్వొత్తులు.. టార్చ్‌లైట్లు.. మొబైల్ లైట్ల రూపంలో.. 130 కోట్ల మంది మ‌హాసంక‌ల్పంతో ఆశాదీపాల‌ను వెలిగించారు. 

 

క‌రోనా వైర‌స్‌తో అంధ‌కారంగా మారిన ప్ర‌పంచాన్ని మ‌ళ్లీ క్రాంతి ప‌థంలో న‌డిపేందుకు దేశ ప్ర‌జ‌లంతా ఉల్లాసంగా, ఉత్సాహాంగా దీపాలు జ్వ‌లించారు. కాంతి జ‌గ‌తికి క్రాంతి, శాంతి ప్ర‌సాదిస్తుందని భావిస్తాం. ఇవాళ మెరిసిన‌ ప్ర‌మిద‌ల ప్ర‌కాశం.. ఈ ప్ర‌పంచానికి కొత్త వెలుగునిస్తుందని ఆశిద్దాం. సంఘీభావ‌మే స‌మాజాన్ని కాపాడుతుంది. క‌రోనా కారుచీక‌ట్ల నుంచి ఈ ప్ర‌పంచం బ‌య‌ట‌ప‌డాలంటే దానికి ఐక్య‌తే ఆయుధం. ఈ మద్య ప్రధాని ఆదివారం పూట జనతా కర్ఫ్యూ పాటించమిన చెప్పిన విషయం తెలిసిందే.  ఆ రోజు దేశ వ్యాప్తంగా జనతా కర్ప్యూ పాటించి ఐదు గంటలకు చప్పట్లు కొట్టారు.   

 

ఈ రోజు రాత్రి దేశ వ్యాప్తంగా దీపాలు వెలిగింది భారతీయుల ఐక్యత మరోసారి చాటి చెప్పారు.  ఏదైనా కోరిక‌ తీరాలంటే దీపాన్ని వెలిగించి, ఆ దీపానికి నివేద‌న స‌మ‌ర్పించి, న‌మ‌స్క‌రించే ఆచారం మ‌న‌కు ఉన్న‌ది. ఇవాళ జ‌రిగిన ఈ దీపారాధ‌న స‌ర్వాభీష్టాల‌ను సిద్ధింప‌చేస్తుంది. కాల‌కూట విషనాగుగా మారిన క‌రోనాను త‌రిమేందుకు ఈ దీప‌నివేద‌నే మ‌న‌కు శ‌క్తినిస్తుంది. భారత దేశాన్నే కాదు.. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ పూర్తిగా అంతం కావాలన్న కోరికతో అందరూ దీపం వెలిగించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: