కరోనాపై పోరాటంలో మనం ఏకాకులం కాదని ఏప్రిల్ 5 రాత్రి 9 గంటలకు లైట్లు ఆర్పి.. దీపాలు వెలిగించి ప్రపంచానికి చాటుదామన్న ప్రధాని మోడీ పిలుపు మేరకు యావత్ దేశం ముందే దీపావళి చేసుకుంది. కరోనా పై విజయం సాధించాలన్న కోరిక.. పోరాటానికి మేమూ సహకరిస్తామన్న మద్దతును జనం ప్రధానికి తమ దీపాల ద్వారా చాటి చెప్పారు. ఈ కార్యక్రమానికి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ జనం ఏకతాటిపై నిలిచారు.

 

 

అయితే ఇలాంటి కార్యక్రమాలను చూపించేందుకు మీడియా ఎప్పుడూ పోటీపడుతుంటుంది. ముందే చెప్పిన కార్యక్రమం కావడంతో ప్రముఖుల ఇళ్ల వద్ద మీడియా ముందుగానే కాపుకాసింది. సరిగ్గా తొమ్మిది కాగానే టీవీల్లోనూ దీపకాంతుల సందడి కనిపించింది. అయితే ఏపీ సీఎం జగన్ మాత్రం లైవ్ ద్వారా కనిపించలేదు. బహుశా.. ఐఅండ్ పీఆర్‌ వారే నేరుగా ఛానళ్లకు ఫీడ్ ఇస్తామని చెప్పి ఉండొచ్చు. దీంతో ముందుగా జగన్ దీప కాంతుల దృశ్యాలు టీవీ తెరలపై కనిపించలేదు.

 

 

ఆ తరవాత కనిపించిన జగన్..నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు సంఘీభావంగా కొవ్వొత్తి వెలిగించి దీపోత్సవంలో పాల్గొన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాత్రి 9 గంటల సమయంలో విద్యుత్‌ దీపాలు ఆర్పివేయగా సీఎం వైయస్‌ జగన్, అధికారులు దీపాలు వెలిగించి సంఘీభావం ప్రకటించారు. రాష్ట్ర ప్రజలు కూడా రాత్రి 9 గంటలకు ఇళ్లలో లైట్లు ఆర్పి దీపాలు వెలిగించారు.

 

 

ఇక్కడే ఓ విశేషం ఉంది. జగన్ కొవ్వొత్తి వెలిగించినా... నడుం ఎత్తు పెద్ద పెద్ద పూజా దీపాలను కూడా ఏర్పాటు చేశారు. అందులోనూ దీపాలను వెలిగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీజీపీ సహా ఉన్నతాధికారులు సామాజిక దూరం పాటించి... కరోనా వ్యాప్తి నిరోధక స్ఫూర్తిని పాటించారు.

 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: