కరోనా విజృంభిస్తోంది. ఇప్పుడు ప్రపంచంలో కరోనా బారిన పడని దేశమంటూ లేదంటే అతిశయోక్తి కాదు. మరి అలాంటి సమయంలో ప్రజలు ఏం చేయాలి.. ప్రజలను కాపాడుకోవడానికి ప్రభుత్వాలు ఏం చేయాలి.. ఇది చాలా ముఖ్యం. సరైన నాయకత్వం లేకపోతే ఇలాంటి క్లిష్ట సమయాల్లో వేలాది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఇప్పుడు పాకిస్తాన్‌లో అలాంటి పరిస్థితే ఉంది.

 

 

పాకిస్తాన్‌లో ఇప్పటివరకు 2,818 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా.. 41 మంది మృతి చెందారు. అక్కడ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ నాయకత్వలోపంతో పాటు.. దేశ ప్రజల మూర్ఖత్వం వారినే ప్రమాదపుటంచుల్లో పడేస్తోంది. వాట్సప్‌లలో, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు కథనాలు నమ్ముతూ జనం నిర్లక్ష్యంగా ఉంటున్నారట. దీనిపై ఏకంగా ప్రధాని ఇమ్రాన్‌ ఖానే మండిపడ్డాడు.

 

 

ఆయన ఏమన్నారంటే.. ‘గత కొద్దిరోజులుగా సోషల్‌ మీడియాలో జరుగుతున్న ఓ ప్రచారం నా దృష్టికి వచ్చింది. అల్లా పాక్‌ ప్రజలకు కరోనా మహమ్మారి రాకుండా చేశారనే ప్రచారం సాగుతోంది. ఇలాంటి వాటిని దయచేసి నమ్మకండి. ఇలాంటి పిచ్చి ప్రచారాలు చేయోద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. మహమ్మారి కరోనా ఎవరినీ విడిచి పెట్టదు. పాక్‌ ప్రజలకు రోగనిరోధక శక్తి ఎక్కువ కలిగి ఉంటారని దీంతో కరోనా రాదని, వచ్చిన ఏం కాదనే భావన కూడా సరైనది కాదంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 

 

ఇంకా ఏమన్నారంటే.. “ . న్యూయార్క్‌ నగరాన్ని చూడండి.. ఎంతో మంది ధనికులున్న ఆ సిటీ పరిస్థితిని గమనించండి. కరోనా వైరస్‌ రూపంలో మనకొక పెద్ద చాలెంజ్‌ ఎదురైంది. ఈ సవాల్‌ను సమర్థవంతంగా ఎదుర్కొని విజయం సాధిద్దాం. ఈ సమయంలో మూర్ఖులుగా ప్రవర్తించి చరిత్రలో నిలిచిపోకండి అంటూ పాక్‌ ప్రజలకు ఇమ్రాన్‌ ఖాన్‌ విజ్ఞప్తి చేశారు. మరి ఇప్పుడైనా పాక్ ప్రజలు మేల్కొంటారో లేదో..?

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

https://tinyurl.com/NIHWNgoogle

https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: