తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తుంది. ఈ ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎక్కువ శాతం నిజాముద్దీన్ బాధితులే వున్నారు. ఇక ఇప్పటివరకు తెలంగాణ లో 283 కరోనా  కేసులు యాక్టీవ్ గా ఉండగా 32 మంది కోలుకొని 11మంది మరణించారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా మొన్నటి వరకు హైదరాబాద్, కరీంనగర్ కే పరిమితమైన ఈ వైరస్ తాజాగా మిగితా జిల్లాలకు కూడా పాకింది. హైదరాబాద్ తరువాత  వరంగల్ అర్బన్ లో ఎక్కువ కేసులు నమోదు కావడం గమనార్హం. దాంతో జిల్లా వ్యాప్తంగా లాక్ డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు పోలీసులు. 
 
ఇదిలావుంటే నిజాముద్దీన్ సంఘటన లేకుంటే  ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లు ఈనెల 7న తెలంగాణ కరోనా ఫ్రీ స్టేట్ అయ్యే ఉండేది కానీ నిజాముద్దీన్ ప్రార్థనలకు  తెలంగాణ నుండి కూడా ఎక్కువ సంఖ్యలో హాజరు కావడం, దురదృష్టవశాత్తు వారిలో చాలా మందికి కరోనా సోకడం తో ఇప్పుడు రాష్ట్రం అతలాకుతలం అవుతుంది. మరో వైపు తెలంగాణ తో సహా ఆంధ్రప్రదేశ్ ,తమిళనాడులో రోజు రోజు కి కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఎక్కువ శాతం నిజాముద్దీన్ బాధితులే వున్నారు. ఇక కరోనా కట్టడికి అమలులో ఉన్న లాక్ డౌన్ ఈనెల 14తో ముగియనుంది. మరి అప్పటి వరకు పరిస్థితి అదుపులోకి వస్తుందో లేదో చూడాలి. 
 
క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :
 
NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈక్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: