కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకు పెరిగిపోతుంది.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఈ కరోనా బారిన 12 లక్షలమందికిపైగా పడ్డారు.. అందులో ఏకంగా 66 వేలమంది మృతి చెందారు. ఇంకా ఇటలీ, ఇరాన్, అమెరికా, స్పెయిన్ వంటి దేశాల్లో అయితే ఈ కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. ఇతర దేశాలలో రోజుకు వేలమంది మృతి చెందుతున్నారు. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే స్పెయిన్ లో కూడా కరోనా వైరస్ తన పడగా విప్పింది.. తన ప్రతాపాన్ని స్పెయిన్ ప్రజలకు చూపిస్తుంది.. ఈ కరోనా వైరస్ సోకి ఆస్పత్రులకు చేరుతున్న ప్రజల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దీంతో ఆ ఆస్పత్రులు అన్ని నిండిపోయాయి.. ఎక్కడ కాళీ లేవు.. ఆస్పత్రుల సామర్ధ్యానికి మించి కరోనా రోగుల్ని చేర్చుకుంటున్నారు.. 

 

ఇప్పటికే ఆ రోగులకు వారు తగినంత చికిత్స ఇవ్వలేకపోతున్నారు.. ఇంకా అలాంటి ఈ సమయంలో చేసేది ఏమి లేక.. మనసు కఠినం చేసుకొని ఆస్పత్రికి వచ్చిన వృద్ధులను తిప్పి పంపుతున్నారు. ఉన్న ఐసీయూలను వయసులో ఉన్నవారి కోసం మాత్రమే కేటాయించాలన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. 

 

ఇంకా కేర్ హోమ్స్‌లో కూడా పరిస్థితి ఇలాగే ఘోరాతి ఘోరంగా మారింది.. మనం కళ్లారా చూడకపోయినప్పటికీ తలచుకుంటేనే కన్నీళ్లు వచ్చేలా వారి పరిస్థితి ఉంది.. వృద్ధుల యోగక్షేమాలు చూసుకునేందుకు అక్కడ సిబ్బంది లేకపోవడం కారణంగా అనేక మంది వారున్న మంచాలపైనే ప్రాణాలు విడిచిపెడుతున్నారు. ఇంకా స్పెయిన్‌లో ఇప్పటి వరకు 1,26,168 మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. అందులో 12 వేలమందికిపైగా మృతి చెందారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: