అమెరికా అనగానే జనాలకు ఒక ఆసక్తి ఉండేది. అమెరికా వెళ్ళడానికి చాలా మంది ఎంతో ఆసక్తి చూపించే వారు. మన దేశ వ్యాప్తంగా కూడా అమెరికాలో ఉద్యోగం చేయడాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉంటారు జనాలు. అమెరికాలో ఉద్యోగం వస్తే భారీగా సంపాదించుకోవడమే కాదు ఇంటి దగ్గర కూడా విలువ ఎంతో పెరుగుతుంది అనేది జనాలకు ఎక్కువగా ఉన్న నమ్మకం ఇప్పుడు. కాని అది కొన్ని రోజుల నుంచి తగ్గుతుంది. 

 

ఇప్పుడు అమెరికాలో ఉన్న చాలా మంది భారతీయులు అమెరికా నుంచి వచ్చేయడానికి రెడీ అయ్యారు. అమెరికాలో అమ్మో ఉద్యోగం వద్దు అంటున్నారు. ఇప్పుడు కొంత మంది హెచ్ 1 బీ మీద అమెరికా వెళ్ళడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అందరూ కూడా వెనక్కు తగ్గే పరిస్థితి ఏర్పడింది. అమెరికాలో ఉద్యోగం చెయ్యాలి అనుకున్న వాడు బతికి ఉంటే బలుసు ఆకు తినవచ్చు అని భావిస్తున్నాడు. 

 

దేశం మొత్తం కరోనా ప్రభావం ఉండటంతో అమెరికా వెళ్ళడానికి ఎవరూ కూడా ఇప్పుడు ఆసక్తి చూపించడం లేదు. చచ్చేది ఏదో ఇక్కడే చాద్దాం అక్కడ చస్తే పట్టించుకునే వాడు ఎవడూ ఉండడు అనేది జనాలకు స్పష్టంగా అర్ధమవుతుంది. ఇక అక్కడ హెచ్ 1 బీ మీద ఉద్యోగాలు చేసే వాళ్ళు అందరూ కూడా వెనక్కు వచ్చేయడానికి రెడీ అయినట్టు తెలుస్తుంది. ఉద్యోగాల నుంచి చాలా మంది తప్పుకున్నారని, తాము అక్కడ ఉండటానికి ఇష్టపడటం లేదని ప్రచారం జరుగుతుంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: