ప్రపంచం అంతా కరోనా భయంతో వణికి పోతుంది.  ఎక్కడ చూసినా కరోనా గురించి మాట్లాడుకుంటున్నారు.  మనుషుల మద్య సామాజిక దూరం పెరిగింది.  కొన్ని దేశాల్లో లాక్ డౌన విధించిన విషయం తెలిసిందే.  కరోనా వైరస్‌ పుట్టిన చైనాలో మొత్తం 3,300 మందికి పైగా ఆ వైరస్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.  చైనాలోని దక్షిణ ప్రాంతంలో కొత్తగా 30 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని అక్కడి  అధికారులు తెలిపారు. నిన్న ఈ 30 కేసులు నమోదుకాగా వారిలో 25 మంది విదేశాల నుంచి వచ్చినవారని చెప్పారు.

 

కరోనా లక్షణాలతో బాధపడుతున్న మరో 62 మందిని అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు చైనాలో 81,669 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ కరోరా భయంతో విందు, వినోద కార్యక్రమాలన్నీ మానేస్తున్న విషయం తెలిసిందే.  తాజాగా తల్లి మృతికి సంతాపంగా ఓ వ్యక్తి ఏర్పాటు చేసిన విందు 26 వేల మందిని క్వారంటైన్‌ పాలు చేసింది.  మద్యప్రదేశ్ లో ఈ ఘటన వెలుగు లోకి వచ్చింది.  ఓ వైపు లాక్ డౌన్ ఉన్నా ఇలాంటి పిచ్చి పనులు చేసినందుకు వారిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. గత నెలలో అతడి తల్లి చనిపోవడంతో 17న దుబాయ్ నుంచి నగరానికి చేరుకున్నాడు.

 

 

మూడు రోజుల తర్వాత అంటే మార్చి 20న  సంప్రదాయం ప్రకారం.. తల్లి మృతికి సంతాపంగా విందు ఏర్పాటు చేశాడు. బంధుమిత్రులు అందరూ కలిసి దాదాపు 1200 మంది దీనికి హాజరయ్యారు. అనంతరం 27న అతడితోపాటు ఆ వ్యక్తి భార్య కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. అప్పుడు అధికారులు ఆరా తీయడంతో అసలు విషయం బయటపెట్టాడు.  కాగా, విందులో పాల్గొన్న మరో 10 మందికి కూడా కరోనా వైరస్ సోకినట్టు మూడో తేదీన నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు విందుకు హాజరైన, వారితో సన్నిహితంగా మెలిగిన దాదాపు 26,000 మందిని హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా కోరారు.

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: