కరోనా ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సంక్షోభం. ఇప్పటి వరకూ ప్రపంచం ఎదుర్కోనంత గడ్డు పరిస్థితి. మరి ఈ కరోనా సంక్షోభం ప్రపంచ గతిని మార్చేస్తోందా..? ప్రపంచంలో ఇప్పటి వరకూ ఉన్న ఆర్థిక, అంగబల సమీకరణాలను మార్చేస్తోందా..? మరి ఈ అగ్ని పరీక్ష నుంచి భారత్ గట్టెక్కుతుందా.. ఈ సంక్షోభాన్ని భారత్ అవకాశంగా మలచుకుంటుందా..?

 

 

ఇప్పుడు ఇది ఆసక్తికరమైన చర్చగా మారింది. కరోనా విషయంలో మిగిలిన అనేక దేశాలతో పోల్చితే మనదేశం పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. అమెరికా వంటి అబివృద్ధి చెందిన దేశంలోనే కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతున్నారు. అమెరికాలో నమోదు అయిన కరోనా పాజిటివ్ కేసులు మూడున్నర లక్షలకు చేరుకున్నాయి. కరోనా కారణంగా మరణాలు దాదాపు పది వేలకు చేరుకుంటున్నాయి.

 

 

కరోనా మహమ్మారి అమెరికాను అతలాకుతలం చేస్తుందా.. అమెరికాకు ఉన్న అగ్ర రాజ్యం హోదాను తప్పిస్తుందా.. ఈ దెబ్బతో ప్రపంచంపై అమెరికా గుత్తాధిపత్యం నశిస్తుందా.. అన్న విశ్లేషణలు లేకపోలేదు. ఇప్పటికే కరోనా వల్ల మొదట్లో నష్టపోయినా చైనా ఆ మహమ్మారిని కట్టడి చేయగలిగింది. దీంతో ప్రపంచంపై చైనా పెత్తనం పెరిగే అవకాశం ఉంది. అది ప్రపంచ నెంబర్‌ వన్ గా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు విశ్లేషకులు.

 

 

ఇక భారత్ విషయానికి వస్తే మొదట్లో పరిస్థితి కాస్త అదుపులో ఉన్నట్టు కనిపించినా ఇప్పుడు అది ప్రమాదకరంగా మారుతోంది. దేశంలో కేసుల సంఖ్య నాలుగు వేలు దాటిపోయాయి. ఇప్పటికైనా కరోనాను కట్టడి చేయగలిగితే... భారత్ కూడా చైనా తర్వాత సూపర్ పవర్ గా అవతరించే అవకాశాలు పెరుగుతాయి. కరోనా కారణంగా ఫ్రాన్స్, బ్రిటన్ కుదేలవడం కూడా భారత్ కు కాస్త పోటీ తగ్గించే అంశమే. చూడాలి ఇండియా తలరాత ఎలా ఉందో..?

 

 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: