కరోనా వైరస్ ప్రభావం ప్రముఖులకూ తప్పడం లేదు. ఇప్పటికే అనేక దేశాల ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. రాణులు, ప్రధానమంత్రులు, యువ రాణులు, సైన్యాధ్యక్షులు ఇలా.. ఎందరో కరోనా పాజిటివ్ గా తేలారు. అలాగే ఇప్పటికే కరోనా వైరస్‌ సోకిన బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఆసుపత్రిను తాజాగా ఆసుపత్రికి తరలించారు. ఆయనకు ఇప్పటికే కరోనా పాజిటివ్ అని తేలిన సంగతి తెలిసిందే.

 

 

అప్పటి నుంచి ఆయన స్వీయ నిర్బంధంలోనే ఉంటున్నారు. అయితే కరోనా వైరస్ లక్షణాలు పెరగడంతో ఆయన్ను ఆసుపత్రికి చేర్చారు. ఈ విషయాన్ని ఆయనే ప్రకటించారు. "నా ఆరోగ్యం ఇప్పుడు మెరుగ్గానే ఉంది. నా ఏడు రోజుల నిర్బంధం కూడా పూర్తయింది. అయినా, నాలో ఇంకా స్వల్పంగా వైరస్‌ లక్షణాలు ఉన్నాయి. ఇంకా శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లక్షణాలు పూర్తిగా తొలగిపోయేంత కాలం నేను స్వీయ నిర్బంధంలో ఉంటానంటూ జాన్సన్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

 

 

ఇక ప్రధాన మంత్రి పరిస్థితే ఇలా ఉంటే.. బ్రిటన్‌లో కరోనా ఓ స్థాయిలో రెచ్చిపోతోంది. బ్రిటన్‌లో వైరస్‌ విజృంభణ ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. మన దేశం తరహాలోనే ఇప్పటికే బ్రిటన్ లాక్‌ డౌన్‌ ఉంది. తాజాగా ఆ ఆంక్షల్ని మరింత కఠినతరం చేశారు. బ్రిటన్‌లో ఇప్పటికే 50 వేల వరకూ కరోనా కేసులు నమోదయ్యాయి. దాదాపు 5 వేల మంది వరకూ మృత్యువాత పడ్డారు.

 

 

అమెరికా, స్పెయిన్, ఇటలీ వంటి మిగిలిన దేశాలతో చూసుకుంటే ఈ సంఖ్య తక్కువగానే అనిపిస్తున్నా.. బ్రిటన్ చాలా చిన్నదేశం అన్న విషయం మరిచిపోకూడదు. బ్రిటన్‌లో 24 గంటల్లోనే 6 వేల కేసులు పెరిగినట్లు అధికారులు ప్రకటించారు. ఆదివారం ఒక్కరోజే 621 మంది చనిపోయారు. దీన్ని బట్టి చూస్తే కరోనా బ్రిటన్‌లో ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో తెలిసిందే. ఇప్పటికే ఈ దేశంలోని రాజ కుటుంబీకులకు సైతం కరోనా వచ్చిన సంగతి తెలిసిందే.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: