అమెరికా అందమైన దేశం.. అక్కడికి వెళ్లితే డబ్బులు బాగా సంపాదించవచ్చూ.. చాలా ఎంజాయ్ చేయవచ్చూ.. ఇది గత సంవత్సరం ప్రతి యువతలో ఉన్న కోరిక.. కానీ ఇప్పుడు.. మాకు బుద్ధి వచ్చింది.. ఈ అమెరికా కంటే ఇండియానే నయం.. అనుకుంటున్నారట.. అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నవారు.. అవును ఇలా అనుకోవడంలో తప్పు లేదు.. ఎందుకంటే కరోనా దాడికి చైనా పూర్తిగా నాశనం అవుతుందనుకున్న వారికి.. ఈ వైరస్ అమెరికాను అంతం చేస్తుందని ఊహించలేదు.. ఇప్పుడు చైనాకు ఏం అవుతుందో అనే భయం కంటే.. అమెరికాలో ఈ వైరస్ ఎందుకు ఇంతలా వ్యాపించింది అనే ప్రశ్నలే ఎక్కువగా వినిపిస్తున్నాయి..

 

 

ఇకపోతే అందమైన సిటీ న్యూయార్క్‌.. భయం గొలిపేలా మారుతున్న ఈ రాష్ట్రంలో కరోనా వైరస్‌ అడ్డూ అదుపు లేకుండా ఊచకోత కోస్తోంది. ఈ మహమ్మారి కాటుకు బలవుతున్నవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఒక 24 గంటల వ్యవధిలో 630 ప్రాణాలను ఈ వైరస్‌ హరించిందని అక్కడి గవర్నర్‌ ఆండ్రూ క్యూమో చెప్పారు. ఇదిలా ఉమడగా న్యూయార్క్‌ రాష్ట్రంలో ఏప్రిల్‌ 2-3 మధ్య రికార్డు స్థాయిలో 562 మంది కరోనాతో మరణించారు. ఆ తర్వాత గడిచిన 24 గంటల్లో ఈ మరణాల సంఖ్య 630కి చేరింది దీంతో కొవిడ్‌-19 తో ఇక్కడ బలైనవారి సంఖ్య 3,565 కు చేరింది. అదీగాక దేశంలోనే అత్యధికంగా ఈ మహమ్మారి బారిన పడ్డ రాష్ట్రం ఇదే కావడం దురదృష్టకరం..

 

 

ఆకలిగొన్న పులిలా ఎన్నో ప్రాణాలు బలితీసుకుంటున్న కొవిడ్‌-19 ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద మానవతా సంక్షోభాన్ని సృష్టిస్తోంది. ఈ వైరస్ వల్ల చనిపోయిన తమ వారి పార్థివ దేహాన్ని పట్టుకొని  కనీసం గుండెలవిసేలా రోదించే అవకాశాన్నీ కూడా ఇవ్వడంలేదు. అయినవారిని కోల్పోయి, పుట్టెడు దుఖంలో ఉన్న వారిని అక్కున చేర్చుకొని ఓదార్చే వీలునూ బంధుమిత్రులకు కూడా కల్పించడంలేదు. కడుపు తరుక్కుపోయేలా చేసే ఇలాంటి దృశ్యాలు ఇప్పుడు అమెరికాలో నలుమూలలా కనిపిస్తున్నాయి.. బహుశా ఇలాంటి కష్టం ఇక జీవితంలో ఎప్పుడు రావద్దని ఎందరో వేడుకుంటున్నారు కావచ్చూ.. 

మరింత సమాచారం తెలుసుకోండి: