ఏపీ ప్రభుత్వం కర్నూలు ప్రజలకు షాక్ ఇచ్చింది. జిల్లాలో నిన్న ఒక్కరోజే 52 కేసులు నమోదు కావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా నుంచి 388 మంది మర్కజ్ ప్రార్థనలకు హాజరు కావడంతో నిన్న ఒక్కరోజే ఈ స్థాయిలో కేసులు బయటపడ్డాయి. దీంతో జిల్లాలో బాధితుల సంఖ్య 56కు చేరింది. వీరిలో 55 మంది ఢిల్లీ ప్రార్థనలకు హాజరైన వారే కావడం గమనార్హం. అధికారికంగా ప్రభుత్వం 53 కేసుల వివరాలు ప్రకటించగా మరో మూడు కేసుల వివరాలు ప్రకటించాల్సి ఉంది. 
 
ప్రభుత్వం ఇప్పటికే కర్నూలు జిల్లాను కంటైన్‌మెంట్ జోన్ గా ప్రకటించింది. 48 గంటల పాటు ఇక్కడ నిత్యావసరాలు సైతం బంద్ కానున్నాయి. కర్నూలు జిల్లా కేంద్రంతో పాటు అవుకు, పాణ్యం, గడివేముల, ఆత్మకూరు, బనగానపల్లె, నందికొట్కూరు, కోడుమూరు, నంద్యాల ప్రాంతాలను ప్రభుత్వం కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రకటించింది. నిన్న ఒక్కరోజే భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడంతో జిల్లా ఉలిక్కిపడింది. 
 
మొన్నటివరకు కర్నూలుపై కరోనా ప్రభావం పెద్దగా లేదు. నిన్న ఒక్కరోజే 52 కేసులు నమోదు కావడంతో జిల్లా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసులు పలు ప్రాంతాలలో బారికేడ్లను ఏర్పాటు చేసి రాకపోకలను సైతం బంద్ చేశారు. అధికారులు పాజిటివ్ కేసులు నమోదైన వారి కుటుంబ సభ్యులను, సన్నిహితులను క్వారంటైన్ కు తరలిస్తున్నారు. 
 
జిల్లాలో కొత్త కేసులు నమోదు కాకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. కేసులు నమోదైన ప్రాంతాలలో క్లినికల్ స్ప్రే చేయిస్తున్నారు. జిల్లాలో వైరస్ వ్యాప్తి చెందకుండా... కొత్త కేసులు నమోదు కాకుండా పగడ్బంధీగా చర్యలు చేపడుతున్నారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు సూచించడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కర్నూలు జిల్లాలోనే అత్యధికంగా కేసులు నమోదు కావడం గమనార్హం. జిల్లాలో మరో 110 నమూనాలకు సంబంధించిన రిపోర్టులు అందాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: