చైనాలో పుట్టుకొచ్చిన క‌రోనా వైర‌స్ లేదా కోవిడ్‌-19.. ప్రపంచవ్యాప్తంగా విజృంభణ కొనసాగుతోంది. మొత్తం 205 దేశాలకు వ్యాప్తిచెందిన ఈ మహమ్మారి ఇప్పటికే వేలాది మందిని పొట్టనబెట్టుకుంది. కొన్ని లక్షల మంది ఈ వ్యాధితో పోరాడుతున్నారు. మహమ్మారిని కట్టడి చేయడానికి పలు దేశాలలో నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. ప్రజలను ఇళ్ల నుంచి రాకుండా ఆంక్షలు జారీచేస్తున్నాయి. అయినా, వైరస్ మరణాలు, బాధితుల సంఖ్య మాత్రం రోజు రోజుకూ పెరుగుతోంది. అయితే గబ్బిలాల ద్వారా ఈ ప్రాణాంత వైరస్‌ వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా ఎందరో చెబుతూ వచ్చారు.

 

ఈ క్ర‌మంలోనే క‌రోనా దెబ్బ‌కు హైదరాబాద్‌లో గబ్బిలాలు కనిపించకుండా పోయాయి. ఇది వరకు పురాతన భవనాలతోపాటూ... అక్కడక్కడా చెట్లపై వేలాడుతూ కనిపించే గబ్బిలాలు... ఇప్పుడు చూద్దామన్నా కనిపించట్లేదు. క‌రోనాకు గ‌బ్బిలాలే అని ప్ర‌జ‌లు న‌మ్మ‌డంతో  గబ్బిలాలపై పగ, ప్రతీకారేచ్ఛతో మండిపోతున్నారు. ఇక‌ తమ ఏరియాల్లో ఏ చెట్లపైనైనా గబ్బిలాలు కనిపిస్తే చాలు ఎండు పుల్లలు, కాగితాలు పోగేసి చెట్టు కింద మంట పెడుతున్నారు. ఆ పొగకు ఊపిరాడక గబ్బిలాలు అక్కడి నుంచి వెళ్లిపోయి వేరే చోటు చూసుకుంటున్నారు. 

 

అలా వెళ్తూ వెళ్తూ చాలా గబ్బిలాలు సరైన ఆహారం దొరక్క చనిపోతున్నాయి. ఇలా క‌రోనా దెబ్బ‌కు గ‌బ్బిలాల ప‌రిస్థితి అతి దారుణంగా మారిపోయింది. క‌రోనా గ‌డ్డిలాల వ‌ల్ల వ‌చ్చింద‌ని ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. అయితే శాస్త్రవేత్తల ప్రకటన తర్వాత.. ఈ నిశాచర జీవులపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. నిజానికి గబ్బిలాల వల్ల కరోనా వైరస్ రాలేదనీ, ఇది అసత్య ప్రచారం అని బయాలజిస్టులు, వన్యప్రాణి సంరక్షకులు అంటున్నారు. ఇలాంటి అసత్య ప్రచారాల వల్ల అమాయక ప్రాణులు బలైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే కొన్ని రోజులు కొన‌సాగితే అతి త్వ‌ర‌లోనే  గబ్బిలాలు అంత‌రించిపోతాయ‌ని కూడా అంటున్నారు.
 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: