ప్రతిపని పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది. మామిడి చెట్టుకు నవంబరు మాసంలో ఎన్ని నీళ్ళు ఎన్ని ఎరువులు వేసినా సహజ సిద్ధమైన మామిడి పండ్లు కేవలం ఏప్రిల్ మాసంలో మాత్రమే అందుబాటులోకి వస్తాయి. ఈ విషయంలో ప్రకృతి మనకు ఒక సందేశాన్ని ఇస్తోంది.


ప్రతిపని ఫలితం రావడానికి కొంత నిర్దిష్ట సమయం ఉంటుంది అన్న సంకేతం మామిడి చెట్టును చూస్తే ఎవరికైనా కలిగితీరాలి. అదేవిధంగా ఉద్యోగాల అన్వేషణ చేస్తూ జీవన పోరాటం చేసే ఇద్దరు వ్యక్తులలో ఒక వ్యక్తికి ముందుగా ఉద్యోగం వచ్చి చాల ఆలస్యంగా మరొక వ్యక్తికి ఉద్యోగం వచ్చిన సందర్భాలు అనేక సార్లు మన జీవన ప్రయాణంలో ఎదురౌతుంటాయి. 


ఈ విషయంలో కూడ ఈ సంఘటన ఒక వ్యక్త విజయం సాధించడానికి నిరీక్షణ సహనం ఎంత అవసరమో మనకు పరోక్షంగా తెలియచేస్తుంది. దీనితో చేసేప్రతి ప్రయత్నం వెంటనే సఫలం కాదు అన్న విషయం మనకు అర్ధం అయి తీరుతుంది. విజయం సాధించడానికి ధన సంపాదనకు అనేక మార్గాలు ఉన్నా ఏ మార్గం మనకు అనువైనది అన్న ఆలోచనలతో స్పష్టంగా నిర్ణయం తీసుకోగలిగినప్పుడు మాత్రమే ఒకవ్యక్తి విజయం వైపు అడుగులు వేసి తద్వారా ధనవంతుడు కాగలుగుతాడు. 


అన్ని సంపదల అంతిమ లక్ష్యం ఆనందసంపదలను పొందడమే ఈ ఆనందసంపద కలిగి ఉన్న వ్యక్తికి పూర్తిగా సహనం ఉంటుంది. వాస్తవానికి జీవితం సుఖంగా సాగడానికి ఆర్ధిక సంపద ఎంతో అవసరం. మానవ మేధస్సు చేయలేని పనిని ప్రకృతి పరోక్షంగా మనిషి చేత చేయిస్తూ ఉంటుంది. ప్రకృతి ముందు అనుక్షణం మనిషి ఓడిపోతున్నా సహనం కోల్పోకుండా ఆ ప్రకృతిని తన బాటలోకి తెచ్చుకోగల నైపుణ్యమే సహనం. అందుకే భగవంతుడు కి మనం అన్నీ వదలకూడదని మనం చేయలేని పనులు మాత్రమే భగవంతుడు కు అప్పచెప్పాలని ఆధ్యాత్మిక వేత్తలు చెపుతూ ఉంటారు. మనం భోజనం చేసేడప్పుడు ఏ స్థాయిలో కడుపునిండింది అన్న విషయం సహజంగా తెలుస్తుందో అలాగే మనం రాణించాలి అంటే మన పరిధి ఏమిటో తెలుసుకోవాలి. సదా సహనం సంపదకు మూలాధారం..  

మరింత సమాచారం తెలుసుకోండి: