ఎవరికైనా రోగం వస్తే డాక్టర్ దగ్గరకు పరిగెడుతారు. మరి డాక్టర్ వల్లే రోగం వస్తే ఏమి చేయాలి ? ఇపుడిదే పరిస్ధితి  నెల్లూరు జిల్లాలో ఎదురైంది. ఒక డాక్టర్ వల్ల ఎంతమందికి కరోనా వైరస్ సోకిందో అర్ధంకాక జిల్లా యంత్రాంగం జుట్టు పీక్కుంటోంది. ఇంతకీ విషయం ఏమిటంటే నెల్లూరులో ఓ ఆర్ధోపెడిషియన్ డాక్టర్ కు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అది కూడా చెన్నైలో టెస్టు చేయించుకున్నపుడు వైరస్ ఉందని నిర్ధారణ అయ్యింది. అయితే ఆయన అక్కడే ఐసొలేషన్ వార్డులోనో లేకపోతే క్వారంటైన్ సెంటర్లోనో ఉండకుండా వెంటనే నెల్లూరుకు వచ్చేశాడు.

 

విషయం ఏమిటంటే 10 రోజులుగా డాక్టర్ కు జ్వర లక్షణాలున్నా పట్టించుకోకుండా కరోనా నెల్లూరులో చాలామంది పేషంట్లకు వైద్యం చేశాడట. నెల్లూరులో పేషంట్లకు వైద్యం అందిస్తునే అవసరార్ధం చెన్నైకి వెళ్ళాడట. చెన్నైలో కూడా రెండు రోజులున్నాడు. అయితే అక్కడ అనారోగ్యం పెరిగిపోవటంతో కరోనా టెస్టులు చేయించుకున్నాడు. దాంతో పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. వెంటనే టెస్టులు చేసిన వారు డాక్టర్ ను ఐసొలేషన్ వార్డు లేదా క్వారంటైన్ సెంటర్ లో చేరాలని సూచించారు.

 

వాళ్ళతో సరే అని చెప్పిన డాక్టర్ చెప్పకుండానే  చెన్నై నుండి నెల్లూరుకు వచ్చేసి వైద్యం కోసం ఓ ఆసుపత్రిలో చేరాడు. డాక్టరే ఆసుపత్రిలో చికిత్స కోసం చేరటంతో అంతకుముందు ఆయన దగ్గర వైద్యం చేయించుకున్న పేషంట్లతో పాటు ఆయన కుటుంబసభ్యుల్లో కూడా టెన్షన్ పెరిగిపోయింది. దాంతో విషయం తెలుసుకున్న జిల్లా యంత్రాంగం డాక్టర్ కుటుంబసభ్యులతో పాటు ఆయన దగ్గర వైద్యానికి వచ్చిన వాళ్ళందరి వివరాలు సేకరిస్తున్నారు. మొత్తానికి ఓ డాక్టర్ చేసిన పనికి యంత్రాగానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

 

మామూలుగా కరోనా వైరస్ బాధితులకు వైరాలజీ డాక్టర్లో లేకపోతే జనరల్ ఫిజీషియన్లో వైద్యం అందిస్తున్నారు. కాబట్టి అటువంటి డాక్టర్లో ఎవరికైనా వైరస్ సోకిందంటే అర్ధముంది. కానీ ఇక్కడ డాక్టర్ ఆర్ధోపిడీషియన్. ఈయన దగ్గరకు కరోనా పేషంట్లు ఎవరూ రారు. మరి ఈయనకు  వైరస్ ఎలా సోకిందో ఎవరికీ అర్ధం కావటం లేదు. తన దగ్గరకు వచ్చిన పేషంట్లలో ఎవరైనా వైరస్ సోకిన వ్యక్తి ఉన్నాడేమో తెలీటం లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: