అవునండి.. కరోనా వైరస్ విజృంభిస్తుంది.. కాదు అని చెప్పడం లేదు.. అందుకే లాక్ డౌన్ విధించారు.. 21 రోజులు పాటు ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు.. బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. సరే.. మీరు అంత ఇళ్లల్లో బాగానే ఉన్నారు.. మరి యాచకుల పరిస్థితి ఏంటి ? అని చాలామంది అడిగారు..

 

అయితే పార్లే - జీ వంటి సంస్ద యాచకులకు బిస్కెట్లు పంచింది.. కడుపు నింపింది.. కానీ ప్రతి రోజు పార్లే - జీ యాచకులకు బిస్కెట్లు ఇవ్వదు కదా! ఒకవేళ ఇచ్చినా మారుమూల గ్రామాలలో నివసించే యాచకులకు అందవు కదా! అలాంటప్పుడు బయట తిరిగే పోలీసులు, మీడియా వాళ్ళు ఎం చెయ్యాలి? కష్టమో నష్టమో. అందరూ అయితే బయట తిరగలేరు కదా..

 

 

కేవలం పోలీసులు, మీడియా వాళ్ళు మాత్రమే బయట తిరుగుతున్నారు కదా.. అప్పుడు కనిపించినవారికి యాచకులకు ఆహారం పెట్టి.. కుదిరితే ఒక రెండు మూడు రోజులకు ఉండేలా ఇచ్చి వస్తే వాళ్ళు కూడా కడుపు నిండా తింటారు కదా! కానీ ఆలా ఎందుకు చేస్తారు.. పోలీసుల కనిపిస్తే సేవ చేస్తున్నారు .... ఆ సేవకు సంబంధించిన ఫోటోలూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. కానీ విలేకర్లు మాత్రం అలాంటి వాళ్ల విషయంలో సహాయం చేయడం మానేసి వారి ఫోటోల కోసం ప్రాకులాడుతున్నారు.

 

ఓ యాచకురాలు ఆకలితో అలమటిస్తూ ముళ్ళతో ఉన్న పామాయిల్ గెలను ఓ యాచకురాలు తింటున్న సమయంలో ఓ విలేకరి చూశాడు.. అప్పుడు ఏం చెయ్యాలి? ఆమెకు భోజనం పెట్టాలి.. భోజనం పెట్టి వార్త రాసుకో.. వారికి సాయం చేయడంలో తప్పులేదు.. కేవలం ఫోటో చిక్కింది.. అన్నీ ఆగిపోయాయి.. పాపం అని సానుభూతి తెలిపి అతి చేష్టలు చెయ్యకు అని నెటిజన్లు అంత తిట్టిపోస్తున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: